Magazines

జాషువా స్ఫూర్తితో సాంస్కృతిక సామాజికోద్యమాలు నిర్మించాలి

55 నిమిషాల క్రితం

Cultural and social movements must be built drawing inspiration from Joshua.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

జాషువా జయంతి వేడుకలో సుద్దాల అశోక్ తేజ కేవీపీఎస్‌, టీపీఎస్‌‌కే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జాషువా స్ఫూర్తితో స్పూర్తితో సాంస్కృతిక సామాజికోధ్యమాలు నిర్మించాలని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ ‌తేజ చెప్పారు. కేవీపీఎస్‌, టీపీఎస్‌‌కే ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాషువా 131వ జయంతి కార్యక్రమాన్ని భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌ ‌తేజ మాట్లాడుతూ వేలఏళ్లుగా కొనసాగుతున్న సామాజిక అంతరాలను అంతం చేయడానికి అక్షర యుద్ధం చేసిన మహాకవి గుర్రం జాషువా నేటి తరానికి స్ఫూర్తి అని తెలిపారు. జాషువా సాహిత్యం నాడు కొందరి చేత అవమానించబడ్డా అనేకమంది చేత గౌరవించబడిందని చెప్పారు. వేల ఎండ్లుగా కొనసాగుతున్న అసమానతలను తన కలం ద్వారా ప్రజలకు చెప్పారన్నారు. కుల, మతాల గీతల చుట్టూ తిరగకుండా ప్రజలందరూ సమానత్వంతో జీవించాలని ఆకాంక్షించాడని వివరించారు. కేవీపీఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు, భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాషువా స్పూర్తితో ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాద భావజాలాలకు వ్యతిరేకంగా సనాతన ధర్మం పేరుతో సామాజిక అణచివేతతో పాటు ఆర్థిక దోపిడీపై ఉద్యమాలు నిర్మించాలన్నారు. సనాతన ధర్మం పేరుతో సామాజిక అణిచివేత వేల సంవత్సరాల పాటు కొనసాగిందని, నేటి పాలకులు కూడా దానిని పెంచేవిధంగా యథేచ్ఛగా తమ మనువాద ఎజెండాను బలవం తంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడ లేని కులం దుర్మార్గాన్ని తన కవితా రచనల ద్వారా జాషువా తీవ్రంగా నిరసించారని చెప్పారు. ప్రతి కవి ప్రజా ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా, సామాజిక మార్పుకు జాషువా స్ఫూర్తి దోహదం చేస్తుందని చెప్పారు కార్యక్రమంలో డీవై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆదామ్ రాజ్, తెలంగాణ జేఏసి నేత కోల జనార్ధన్, హ్యాపీ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ నిమ్మల రాజశేఖర్, గాయని భూదేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్