Magazines

ఆదర్శ కమ్యూనిస్టు నేత కొమ్మిడి లక్ష్మారెడ్డి

3 గంటల క్రితం

Model Communist Leader Kommidi Lakshma Reddy
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం

ఉక్కు సంకల్పంతో ఉద్యమాల నిర్మాణం
20 ఏండ్ల పాటు సర్పంచ్‌‌గా నిస్వార్ధంగా సే వలందించిన కొమ్మిడి పార్టీ, ఉద్యమాల నిర్మాణంలో విశేష కృషి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పార్టీ సీనియర్‌ ‌నాయకులు లక్ష్మారెడ్డి
భౌతికకాయానికి నివాళులర్పించిన నేతలు​
నవతెలంగాణ -వలిగొండ: రూరల్ ​నేటి తరం ఆదర్శ కమ్యూనిస్టుగా కొమ్మిడి లక్ష్మారెడ్డి నిలిచారని, వారి ఆశయం, ఆదర్శం గొప్పదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. చిన్నతనంలో పట్టిన ఎర్రజెండాను చివరి శ్వాస వరకు విడవకుండా బతికిన గొప్ప నాయకుడు లక్ష్మారెడ్డి అని చెప్పారు. గురువారం మృతిచెందిన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామ మాజీ సర్పంచ్‌, సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నాయకులు ‌కొమ్మిడి లక్ష్మారెడ్డి మృతదేహాన్ని శుక్రవారం వారు సందర్శించి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లక్ష్మారెడ్డి నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమర వీరుల స్ఫూర్తితో సీపీఐ(ఎం)లో చేరి యువజన సంఘంలో, పార్టీ నాయకునిగా విశేష సేవలం దించారని చెప్పారు. పులిగిల్ల గ్రామ సర్పంచ్‌‌గా 20 ఏండ్ల పాటు నీతి నిజాయతీతో అభివృద్ధి కోసం పనిచేశారన్నారు. ఒకవైపు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ మరొక వైపు పార్టీ నాయకునిగా మండల వ్యాప్త ఉద్యమ నిర్మాణం కోసం కృషి చేశారని కొనియాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉక్కు సంకల్పంతో ఎదిరించి పులిగిల్ల గ్రామంలో ఎర్రజెండాను నిలబెట్టారని చెప్పారు. ఆయన జీవితాంతం పాటించిన ఆదర్శాలు, ఆశయాల ను ముందుకు తీసుకు పోయేందుకు నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. జహంగీర్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి మాట్లాడుతూ.. లక్ష్మారెడ్డి 40 ఏండ్లు పార్టీ రామన్నపేట డివిజన్ కమిటీ సభ్యునిగా, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యునిగా, రైతు సంఘం డివిజన్ అధ్యక్షునిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులుగా పని చేశారని వివరించారు. ప్రజా సమస్యలపై పనిచేస్తున్న సమయంలోనే సీపీఐ(ఎం) ఉద్యమాలను బలహీనపరిచే నిర్బంధాల ను ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. ఎన్ని బెదిరింపులున్నా మొక్కవోని ధైర్యంతో మరిన్ని ప్రజా పోరాటాలను నిర్వహించి పులిగిల్ల గ్రామాన్ని సీపీఐ(ఎం) కోటగా తయారు చేశారని కొనియాడారు. 80 ఏండ్ల వయసులోనూ పార్టీ కార్యక్రమాల్లో నిన్నటి వరకు కూడా పాల్గొని ఈరోజు ఆయన అకాల మరణం చెందడం పార్టీకి, మండల ఉద్యమానికి తీరని నష్టమని చెప్పారు. ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడమే ఘనమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జల్లెల పెంటయ్య, బూరుగు కృష్ణారెడ్డి, దాసరి పాండు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, గణపతి రెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నరసింహ, గంగాదేవి సైదులు, బోలగాని జయరాములు, మధ్యపురం రాజు, రాగిరి కిష్టయ్య, గడ్డం వెంకటేష్, కోట రామ చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మేక అశోక్ రెడ్డి,కళ్లెం సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్