ఇంటిపని కోసం పిలిచి బంధించారు
ఏడాదిగా మస్కట్‌లో చిక్కుకున్నారు :
కేటీఆర్‌కు కొడంగల్ యువకుని మొర
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధి కోసం మస్కట్ వెళ్లి అక్కడి యజమానుల చేతిలో వేధింపులకు గురవుతున్న తన తల్లిని ఇండియాకు రప్పించాలని కోరుతూ కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోకపసాల్ వాడ్ గ్రామానికి చెందిన రాజు ఎక్స్‌లో తన బాధను మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రాజు సమస్యను చూసిన కేటీఆర్ తనను వచ్చి కలవాలని చెప్పడంతో మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌నను కలిసి సమస్యను వివరించాడు. స్పందించిన కేటీఆర్ వెంటనే ఓమన్ ఎన్ఆర్ఐ విభాగం వాళ్లతో మాట్లాడారు. లక్ష్మి ఇండియాకు వచ్చేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అమ్మను ఇండియాకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, అధైర్యపడొద్దని రాజుకి ఆయన భరోసానిచ్చారు.
భర్తను కోల్పోయిన తుప్పుడు లక్ష్మి బతుకుదెరువు కోసం ఏడాది క్రితం మస్కట్ వెళ్లారు. అక్కడ ఆర్నెల్లపాటు ఇంట్లో పని మనిషిగా ఉపాధి కల్పించిన యజమానులు అనంతరం జీతం ఇవ్వకుండా ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని లక్ష్మి ఫోన్ ద్వారా తన కొడుక్కి చెప్పారు. దీంతో రాజు తన తల్లిని ఇండియాకు రమ్మని చెప్పడాన్ని విన్న మస్కట్ యజమానులు లక్ష్మి ఫోన్ గుంజుకుని అజ్ఞాతంలోకి పంపారు. ఈ విషయాన్ని రాజు స్థానిక నాయకుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఎవరు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే రాజు ఎక్స్‌లో తన బాధను కేటీఆర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించారు.
మా అమ్మను ఇండియాకు రప్పించండి
53 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)