Magazines

‌ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌ను తొలగించాలి

48 నిమిషాల క్రితం

The Chief Election Commissioner should be removed.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

సర్‌ ప్రక్రియను వెంటనే నిలిపేయాలి
రేపు సీఈఓ కార్యాలయం ఎదుట నిరసనను
జయప్రదం చేయండి : సీపీఐ(ఎం) పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌ ​
సర్‌ ‌ప్రక్రియను వెంటనే నిలిపేయాలనీ, ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌ను తొలగించాలని డిమాండ్‌ ‌చేస్తూ వామపక్ష, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌‌లోని బీఆర్‌‌కే భవన్‌‌లో గల చీఫ్‌ ఎలక్ర్టోరల్‌ ఆఫీస్‌ ‌ముట్టడినీ, అక్టోబర్‌ ఒకటో తేదీన జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసనలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషన్‌లోని మెజార్టీ సభ్యుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అర్హులైన పౌరుల ఓట్లను అక్రమంగా తొలగించడం ప్రజాస్వామ్యానికే పెను ముప్పు అని హెచ్చరించారు. ఈ అప్రజాస్వామిక చర్యలకు బాధ్యుడైన సీఈసీ జ్ఞానేశ్‌‌కుమార్‌‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ ‌చేశారు. వివాదాస్పదమైన సర్‌ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాల‌నీ, ఇప్పటికైనా ఎన్నికల సంఘం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. అక్రమంగా తొలగించిన ఓట్లన్నింటినీ తక్షణమే పునరుద్ధరించాలనీ, కొత్త ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఫారమ్-6 నిబంధనలను సవరించాలని డిమాండ్‌ ‌చేశారు. భవిష్యత్తులో ఎన్నికల కమిషనర్ల నియామకాలలో ప్రభుత్వ జోక్యం లేకుండా తటస్థ కమిటీ ద్వారానే చేపట్టాలని కేంద్రానికి సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్