అంతర్జాతీయంగా ఆదరణ పొందిన గ్లోబల్ ఫ్రాంచైజ్ ‘ది ట్రైటర్స్’ను తెలుగులోకి ప్రైమ్ వీడియో తీసుకు రానుంది. హోస్ట్‌గా తొలిసారి రియాలిటీ షోలోకి హీరో తేజ సజ్జ అడుగు పెడుతున్నారు. 20 మంది విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ హై-ఆక్టేన్ షో.. నాలుగు వారాల పాటు 10 ఎపిసోడ్స్‌గా ప్రసారం కానుంది. నమ్మకం, మైండ్ గేమ్స్, మోసం, హై-స్టేక్స్ డ్రామాతో సాగే ఈ ఆసక్తికరమైన రియాలిటీ గేమ్ షో అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌తో అవార్డు గెలుచుకున్న ‘ది ట్రైటర్స్’ ఫార్మాట్ తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో ఇప్పటికే రెండు సీజన్లకు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత.. ఈ ఫ్రాంచైజ్‌ను తెలుగులోకి తీసుకొస్తున్నారు. డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ఒరిజినల్స్, ప్రైమ్ వీడియో , అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ఇండియా నిఖిల్ మాధోక్ మాట్లాడుతూ, ‘మైండ్ గేమ్స్, స్ట్రాటజీపై దృష్టి పెట్టడంతో ‘ది ట్రైటర్స్ తెలుగు’ అన్‌స్క్రిప్టెడ్ స్పేస్‌లో నిజంగా ఆసక్తికరమైన, డిఫరెంట్ షోగా నిలుస్తుంది’ అని తెలిపారు.






కామెంట్‌లు (0)