అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె జంటగా నటించిన చిత్రం 'తత్వం'. త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 2న థ్రియేటికల్ విడు దలకు సిద్దమైంది. ఈ సందర్భంగా ఈ దర్శకుడు అర్జున్ కోలా మీడియాతో ముచ్చటించారు. గ్రామ పంచాయితీ నేపథ్య కథతో సినిమా అనుకున్నాను. అయితే ఇలాంటి కథకు మర్డర్.. మిస్టరీ అంశాలు, కోర్టు అంశాలు యాడ్ చేస్తే బాగుంటుందనిపించింది. అందుకే పల్లెటూరి నేపథ్యంలో కేసులు, మర్డర్ మిస్టరీతో కథను ప్రిపేర్ చేశాను. ‘తత్వం’ అనే టైటిల్ ఈ స్టోరీకి పెట్టానికి ఓ రీజన్ ఉంది. మర్డర్ మిస్టరీ వెనుక నిజాలు, అబద్దాలు అన్నీ ఉంటాయి. ఓ మనిషి ఏది నమ్మాలి.. ఏది నమ్మకూడదో అనే కన్‌ఫ్యూజన్ వచ్చినప్పుడు ఈ పాయింట్‌లో స్టోరీ నడుస్తుంటుంది. కాబట్టి ఏది నిజమో.. అబద్దమో తెలుసుకున్నప్పుడు ఓ మనిషి తత్వం బయటపడుతుంది. మర్డర్ మిస్టరీతో పాటు క్యారెక్టర్స్‌లోని సైకాలజీని కూడా ఈ సినిమాలో చూపెట్టాను. హీరో పాత్ర చివరిలో ఎలా మారింది అనే దానిపై కూడా ఈ టైటిల్ ముడిపడి ఉంది. ఈ సినిమా ప్రయాణంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాం. మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్‌కు సినిమా విడుదల చేస్తాం అని ఎవరూ అనుకోలేదు. రకరకాల కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తీరా ఈనెల 2న రిలీజ్ అని ప్రకటించిన తరువాత డజన్ సినిమాలు అదే డేట్‌లో రిలీజ్ అవుతున్నాయి. అయినా సరే, కంటెంట్ మీద నమ్మకంతో 2న విడుదల చేస్తున్నాం. చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎస్సెట్. ఈ మిస్టరీని ఆ సౌండింగ్‌తో చూస్తే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే మిస్టరీకి అందరూ ఎంతో థ్రిల్ అవుతారు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూనే సెలవు తీసుకుని షూటింగ్ చేశాను. సినిమా అంటే చిన్పప్పటి నుంచి ఇంట్రెస్ట్ అందుకే నా శాటిస్‌ఫాక్షన్ కోసం దర్శకత్వం చేశాను. దీనికి ముందు ‘కైవల్య’ అనే డెమో ఫిలిం చేశాను. అప్పుడు కాన్ఫిడెన్ష్ వచ్చింది. ఫైనల్ అవుట్‌పుట్ చూసుకున్న తరువాత అనుకున్న దాని కంటే బాగా తీశావు అని మా నిర్మాతలు మెచ్చుకున్నారు. నన్ను నమ్మి ఈ సినిమా తీసినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.







కామెంట్‌లు (0)