Magazines

ఆహ్లాదకరంగా ‘ఏమో ఏమో ఇది..’

6 గంటల క్రితం

Delightfully, ‘What is this...’
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

రోషన్ మేకా, ప్రీతి ముకుందన్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏమో ఏమో ఇది’. డా. శైలేష్ కొలను రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏమో ఏమో ఇది’ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. సున్నితమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే సాహిత్యంతో రూపొందిన ఈ పాట ఆద్యంతం ఆహ్లాదకరమైన ప్రేమానుభూతిని పంచుతుంది. రోషన్ మేకా, ప్రీతి ముఖుందన్ మధ్య కనిపించే అందమైన కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, కార్తీక్, రమ్య బెహరా తమ మధురమైన గాత్రాలతో ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అద్భుతమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే గానం, కనువిందు చేసే విజువల్స్ కలగలిసి ఈ టైటిల్ సాంగ్‌ను ఈ సీజన్‌లోని సరికొత్త లవ్ ఆంథమ్‌గా నిలిపాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్