Magazines

పోటీ ఉన్నప్పటికీ మా సినిమా విజయం ఖాయం

5 గంటల క్రితం

competition
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 2 నిమిషాల చదవడం

అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిం చేలా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొం దుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 9న సినిమా రిలీజ్ అవుతుంది. టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయె, జార్జ్ మరియన్, అక్షయ్ ల‌గుసాని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు ఉపేంద్ర లిమాయె మాట్లాడుతూ,‘నా ప్రాణ స్నేహితుడు సందీప్ రెడ్డి వంగాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నన్ను నా సొంత వాయిస్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. నేను ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రేక్షకులు నాపై కురిపించిన ప్రేమాభిమానాలు మర్చిపోలేను. వైశాఖ్, గుణి వచ్చి వినిపించిన ఈ కథ నాకు చాలా విభిన్నంగా, ఆసక్తి కరంగా అనిపించింది. తెలుగులో ఇది నా మొదటి పూర్తి స్థాయి పాత్ర. అందుకే ఈ మూవీ నా హార్ట్‌కి ఎంతో దగ్గరైంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. నా మంచి స్నేహితుడైన దర్శకుడు గుణి, నిర్మాత వేణు కలయికలో వస్తున్న ఈ తొలి ప్రయత్నం తప్ప కుండా ఘన విజయం సాధించా లని కోరుకుంటున్నా’ అని నటుడు విష్ణు ఓయ్ చెప్పారు.

నటి మాల్వీ మల్హోత్రా మాట్లా డుతూ, ‘‘బా బా బ్లాక్ షీప్ ’అనేది చాలా ఫన్, కొంచెం వెరైటీగా ఉండే ఒక ఆసక్తికరమైన టైటిల్. ట్రైలర్‌లో నా పాత్రను పెద్దగా చూపించలేదు కానీ, థియేటర్లలో సినిమా చూసినప్పుడు మీకు ఒక మంచి సర్‌ప్రైజ్ దొరుకుతుంది’ అని అన్నారు. నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు, నటీనటులకు నా కృతజ్ఞతలు. జాతీయ అవార్డు గ్రహీత ఉపేంద్ర లిమాయేతో కలిసి ప్రయాణించడం నాకు గర్వంగా, ఎంతో గౌరవంగా ఉంది. అద్భుత మైన విజువల్స్ అందించిన డీవోపీ అజయ్ మనసుపెట్టి పనిచేశారు. అలాగే స్టీఫెన్, ఆర్కాడో ఆనంద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. మా సినిమా 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సమయంలో ఇతర పెద్ద సినిమాలు వస్తున్నా.. గతంలో కూడా ఇలాంటి పోటీలో మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు అద్భుతాలు సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా సినిమా కూడా అలాంటి విజయమే సాధి స్తుందని బలంగా నమ్ముతున్నాం’ అని తెలిపారు. దర్శకుడు గుణి మంచికంటి మాట్లాడుతూ,‘ఇది రొటీన్ హీరో, హీరోయిన్, విలన్ తరహా సినిమా కాదు. ఇందులో కనిపించే ప్రతి పాత్ర ఎంతో కీలకం. ఓ మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్