Magazines

‘డోరతీ’ సర్‌ప్రైజ్‌ చేస్తుంది

5 గంటల క్రితం

Dorothy’
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘డోరతీ’. కార్తిక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వం వహించారు. జ్యోతి దేశ్‌పాండే, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే తమిళనాట సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా ఈ సినిమా ఈనెల 2న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ‘ఈ సినిమా చూస్తున్న ప్పుడు ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ఒక్కసారిగా కథ మొత్తం మారిపోయింది. అసలు ఎలాంటి కథ తీసుకున్నాడు అనిపించింది. మొదట భయమేసింది, ఆ తర్వాత చాలా ప్రౌడ్‌గా అనిపించింది. దర్శకుడు ఇలాంటి కథని తీసుకోవడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. మనం సాధారణంగా మాట్లాడుకోలేని కొన్ని అంశాలను చాలా బ్యూటీఫుల్‌గా చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. మన సొసైటీని అర్థం చేసుకునేలా చేసే సినిమా. సినిమా చూసి నేను కదిలిపోయాను. ఇద్దరు హీరోలు కూడా చాలా అద్భుతంగా చేశారు. కార్తీక్ ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఎందుకంటే ఇది నా మనసుకు చాలా దగ్గరైన కథ. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే తమిళనాడులో రిలీజ్ తర్వాత ప్రేక్షకులు సిని మాను చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. తెలుగు ఆడి యన్స్ రెస్పాన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. తెలుగునాట కూడా ఈ సినిమా విజయం సాధిస్తుంది’ అని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్