రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రామాయణం’. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డిఎన్ఈజీ, యశ్కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా రావణుడిగా నటిస్తున్న యశ్ ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన పోషిస్తున్న లార్జర్ ద్యాన్ లైఫ్ రావణుడి అవతార్ను పవర్ఫుల్గా చూపించారు. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి యశ్ పోషిస్తున్న రావణుడి పాత్ర సినిమాకు సంబం ధించిన మోస్ట్ టాక్డ్ అబౌట్ ఎలిమెంట్స్లో ఒకటిగా నిలిచింది. ఇంటెన్సిటీ, పవర్ ఫుల్ ఆరాతో ఆకట్టుకున్న యశ్.. ఈ ఐకానిక్ పాత్రపై మరింత ఆసక్తిని పెంచు తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో యశ్ తన పవర్ఫుల్ లుక్తో ఫ్రేమ్ను డామినేట్ చేస్తున్నారు. రావణుడు శక్తివంతమైన రాజు. అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి. లంకను పరిపాలించిన శక్తిమంతమైన పాలకుడు. అలాంటి రావణుడి కమాం డింగ్ డెమీనర్, పర్సనాలిటీని యశ్ తన లుక్లో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్.. తెరపై రావణుడి పాత్రను ఎంత గ్రాండ్గా ఆవిష్కరించ బోతున్నారో ఒక అద్భుతమైన గ్లింప్స్ ఇస్తోంది. దీనితో పాటు శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబేను పరిచయం చేస్తూ మరో కొత్త పోస్టర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు.
అంచనాలు పెరుగుతున్నాయ్
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)