Magazines

ఈ తరం 'రోమియో జూలియట్'

58 నిమిషాల క్రితం

హర్షిత్, విశాఖ ధిమాన్‌ జంటగా నటిస్తున్న యూత్‌ ఫు
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

హర్షిత్, విశాఖ ధిమాన్‌ జంటగా నటిస్తున్న యూత్‌ ఫుల్ జెన్‌జెడ్ లవ్ డ్రామా ‘రోమియో జూలియట్’. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవ రస ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మాడిరెడ్డి సహ నిర్మాతలు. ఆదివారం ఈ చిత్రంలోని స్టోరీ రివీల్ వీడియోను విడుదల చేశారు. అక్టోబర్ 23న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా కథలోని కోర్ పాయింట్‌ను ముందుగానే ప్రేక్షకులకు పరిచయం చేయడం టాలీవుడ్‌లో అరుదైన ప్రయత్నం. మరో ప్రత్యేకత ఏమిటంటే హీరో ప్రభాస్ పుట్టినరోజునే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ స్టోరీ రివీల్ గ్లింప్స్‌ను విడుదల చేసి.. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. వన్ నైట్ స్టాండ్, హుక్‌అప్, ఫ్లింగ్, బెంచింగ్, సిట్యుయేషన్‌షిప్, బాయ్ బెస్టీ వంటి నేటి రిలేషన్‌షిప్ టెర్మ్స్‌ను హీరో వివరించే విధానం ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుత జెన్‌జెడ్ తరం ప్రేమను, రిలేషన్‌షిప్స్‌ను, గొడవలు, బ్రేకప్స్‌ను ఎలా చూస్తోంది? సిట్యుయేషన్‌షిప్స్, సోషల్ మీడియా, పబ్లిక్ బ్రేకప్స్, మారుతున్న రిలేషన్‌షిప్ అంశాలు కథలో కీలకంగా ఉండనున్నాయని గ్లింప్స్‌ తెలియజేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్