దు
ఫహాద్ ఫాజిల్ హీరోగా ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది.
ఈ సందర్భంగా శనివారం హీరో ఫహాద్ ఫాజిల్ మీడియాతో ముచ్చటించారు.
ఈ సినిమా చేయటానికి కారణం?
- కార్తికేయ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కథ గురించి చెప్పారు. శశాంక్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నా జీవితంలో అసలు ఇలాంటి ఓ కథను వినలేదు. అందుకే ఈ సినిమాని చేయాలని ఫిక్స్ అయ్యాను.
మిమ్మల్ని మెప్పించిన అంశాలు ఏమిటి?
- ఈ చిత్రంలో ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వంటి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే మ్యాజిక్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో లోతైన అంశాలు, భావోద్వేగాలెన్నో ఉన్నాయి. చాలా మందికి చాలా విషయాల్ని అర్థమయ్యేలా చెప్పే చిత్రం అవుతుంది.
చిన్నపాప సారాతో నటించటం ఎలా అనిపించింది?
- సారా అద్భుతమైన నటి. కెమెరా ముందు ఎంతో ఆర్గానిక్‌గా నటిస్తుంది. పేపర్ మీద ఉన్న దాని కంటే ఎక్కువగా ఇంప్రవైజ్ చేస్తుంది. ఎంతో యాక్టీవ్‌గా, ఎనర్జిటిక్‌గా యాక్ట్ చేసింది.
మీ పాత్రలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?
- నేను చేసే ప్రతీ పనిలో నా బెస్ట్ ఇవ్వాలని, నా వర్క్ పట్ల నిజాయతీగా ఉండాలని అనుకుంటాను. ఇందులోని నా పాత్ర అద్భుతంగా ఉంటుంది.
నా క్యారెక్టర్‌లోని జర్నీ కొత్తగా ఉంటుంది. చెడు నుంచి మంచిగా మారే ఆ జర్నీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నా పాత్రకు నేను తెలుగులోనే డబ్బింగ్ చెప్పాను.
కాలభైరవ సంగీతం గురించి?
- కాల భైరవ సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. ఆయన మ్యూజిక్ ఈ మూవీలో ఒక క్యారెక్టర్‌లా ఉంటుంది. ఆయన బీజీఎం యాడ్ అయ్యాక సినిమా నెక్ట్స్ లెవెల్‌లో అనిపించింది.
సూరి పాత్రకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి?
- సూరి క్యారెక్టర్‌ని ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు. నేను నా రియల్ లైఫ్‌లో సూరి పాత్రలా ఉండను. కానీ సూరి లాంటి కారెక్టర్స్‌ని నేను నా జీవితంలో చాలా మందిని చూశాను.
ఈ సినిమా చూసి రాజమౌళి ఏమన్నారు?
- దర్శకుడు రాజమౌళి మా సినిమాలోని కొన్ని సీన్స్ చూసి సలహాలు ఇచ్చారు. ఫైనల్ ప్రోడక్ట్ చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు. దీంతో మాకు సినిమా ఫలితంపై మరింత నమ్మకం పెరిగింది.
ఇదే బ్యానర్‌లో మరో సినిమా చేస్తున్నారా?
- అవును. వచ్చే ఏడాదిలో ఆ ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తారు.
మీ 24 ఏళ్ళ సినీ ప్రస్థానం ఎలా ఉంది?
- ఇంజనీరింగ్ మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యాను. నా మొదటి సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ సినిమాతో మొదలైన నా జర్నీ ఎన్నో జయాపజయాలను చూస్తూ ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటివరకు 66 సినిమాలు చేశాను.
ఇలాంటి కథ వినలే
5 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)