Magazines

‘ప్రేమనే ఊరిలో’ విడుదలకు సిద్ధం

5 గంటల క్రితం

Prema-ne Oorilo
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం అందించడంతోపాటు దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కేజీఎఫ్‌, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి సంభాషణలు రాయగా, గేయ రచయిత రాంబాబు గోసాల పాటలను రచించారు. సునద్ గౌతమ్ సంగీతం అందిస్తుండగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈనెల 25న కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించగా, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన తెలుగులో విడుదలకు సిద్ధమవుతుంది. ‘కర్ణాటకలో హౌస్ ఫుల్ అవుతున్న ఈ ప్రేమ కథ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా అదేవిధంగా ఆదరిస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్, ట్రైలర్ కు అద్భుత స్పందన రావడంతో మేకర్స్ తెలుగునాట కూడా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం. ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథా సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే చాలా భిన్నంగా ఉండే సినిమా ఇది. యూత్‌తోపాటు ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాని చూడొచ్చు’ అని మేకర్స్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్