Magazines

తెలుగులోనూ రిలీజ్‌కి రెడీ

5 గంటల క్రితం

release
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నా కలెక్ష‍న్ల మీద పెద్ద ప్రభావం చూపదు. కాని కొన్ని సినిమాలు రోజులు గడిచేకొద్దీ మౌత్ టాక్‌తో మరింత బలపడతాయి. అలాగే కలెక్ష‍న్లనూ కొల్లగొడతాయి. ‘హనుమాన్ అంశ్’ కూడా అలాంటి చిత్రమే. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా, భక్తులు ప్రేమగా మహారాజ్-జీ అని పిలుచుకునే ఆయన జీవితం, బోధనల స్ఫూర్తితో రూపొందిన ఈ హిందీ చిత్రం ఈ ఏడాదిలో అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పరిమిత స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మిక పరివర్తన వంటి అంశాలు అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డాక్టర్ విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నీమ్ కరోలి బాబా పాత్రలో శోబి నావ్ సత్యా నటించారు. చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రేయాస్ ధర్మాధికారి సంగీతాన్ని అందించగా, రిషి పాఠక్ కూడా సంగీత దర్శకుడిగా క్రెడిట్ పొందారు. ఆధ్యాత్మికతతో నిండిన కథకు సంగీతం మరింత బలాన్ని చేకూర్చింది. హిందీలో విజయవంతమైన థియేట్రికల్ జర్నీ అనం తరం ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హోంబలే ఫిల్మ్స్ తమ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ విభాగం ద్వారా గతంలో ‘హనుమాన్ అంశ్’ను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసింది. ఇప్పుడు సౌత్ ఇండియన్ భాషల థియేట్రికల్ హక్కు లను సొంతం చేసుకుని. ఈ చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈనెల 9న తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదల కానుంది. అలాగే తమిళం, కన్నడ, మలయాళం మార్కెట్లలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. భారతీయ కథలను వివిధ భాషలు, ప్రాంతాల్లోని ప్రేక్షకులకు చేరువ చేయడంలో హోంబలే ఫిల్మ్స్ మంచి గుర్తింపు సాధించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్