Magazines

నవ్వుతూనే ఉంటారు

6 గంటల క్రితం

keep smiling
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

హాస్యనటులు సత్య, యోగిబాబు కలిసి ఓ కొత్త కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాలు బ్యానర్లపై నాగార్జున రెడ్డి, పవన్ బాసంశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం టైటిల్ రివీల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇది తెలుగు, తమిళ భాషలను కలిపి, రెండు ఇండస్ట్రీలకు చెందిన పాపులర్ యాక్టర్స్‌తో తెరకెక్కు తున్న ‘తెలుమిల్’ ప్రాజెక్ట్. గ్లింప్స్ ప్రారంభంలో ఓ తెలుగు వ్యక్తి, ఓ తమిళ వ్యక్తి తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ.. తమ వంటకాలే బెస్ట్ అంటూ గొప్పగా చెప్పుకోవడం నవ్వులు పూయిస్తుంది. తెలుగు వ్యక్తి బిర్యానీతో పాటు కూల్ డ్రింక్‌ను ఆస్వాదిస్తుండగా.. తమిళ వ్యక్తి ఇడ్లీ, సాంబార్ తింటూ కనిపిస్తాడు. వీరిద్దరి మధ్య సరదా వాదన జరుగుతుండగా.. మరో వ్యక్తి ఎంట్రీ ఇచ్చి, ఇంతకంటే పెద్ద కాంబినేషన్ ముందుందని చెప్పడంతో సీన్ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

ఆ తర్వాత సత్య, యోగిబాబులను స్టైలిష్‌గా పరిచయం చేశారు. ఇద్దరూ వైట్ అండ్ వైట్ ట్రెడిషనల్ డ్రెస్‌లో కనిపించారు. వీరి కథలో ప్రేమతో పాటు క్రైమ్, యాక్షన్ అంశాలు కూడా మిళితమై ఉంటాయని దర్శకుడు ఆసక్తికరంగా వెల్లడించారు. చివర్లో సినిమా టైటిల్‌ను ‘గోల్డెన్ భాగ్యం’గా రివీల్ చేశారు. సత్య, యోగిబాబు తొలిసారి ఈ తరహా సెటప్‌లో కలిసి నటిస్తుండటంతో.. వీరిద్దరి కామెడీ స్టైల్, టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జయశ్రీ, అధిరాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సుధర్శన్, కిశోర్ తిరుమల, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి, నిర్మాతలు: నాగార్జున రెడ్డి, పవన్ బసంశెట్టి, సంగీతం: పవన్ సిహెచ్, డీఓపీ : బబ్లూ అజు, ఎడిటర్: రవితేజ గిరిజాల, ఆర్ట్ డైరెక్టర్: కామేష్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్