రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ‘రామాయణ’ మేకర్స్ స్పెషల్ బిహైండ్ ది సీన్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ కనిపించడంతో పాటు.. ఈ పాత్ర కోసం ఆయన చేసిన ప్రిపరేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన ఆసక్తికర మైన విషయాలను చూపించారు.
ఈ వీడియోలో దర్శకుడు నితేశ్ తివారీ మాట్లాడుతూ, ‘రామాయణం’లాంటి సినిమాకు సరైన నటుడిని ఎంపిక చేయడం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ ఇతిహాసంతో కోట్లాది మంది ప్రజలకు ఉన్న విశ్వాసం, భావోద్వేగ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీరాముడి పాత్రకు సరైన నటుడిని ఎంపిక చేయాల్సి వచ్చిందని తెలిపారు.
శ్రీరాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ కూడా ఈ పాత్ర గురించి తన అనుభవాలను పంచుకున్నారు.
ఈ పాత్రను తాను మరో సినిమా లేదా మరో క్యారెక్టర్‌లా చూడలేదని.. శ్రీరాముడి పాత్రకు న్యాయం చేయడం ఒక బాధ్యతగా భావించానని రణ్‌బీర్ తెలిపారు.
ఈ గ్లింప్స్‌లో రణ్‌బీర్ సహనటులు కూడా ఆయన గురించి మాట్లాడారు.
దశరథుడిగా నటిస్తున్న అరుణ్ గోవిల్, సీత పాత్రలో సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే.. శ్రీరాముడి పాత్రకు రణ్‌బీర్ ఎందుకు సరి పోయారో వివరించారు. నటీనటుల లుక్స్, ట్రాన్స్‌ఫర్మే షన్స్‌తో పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణను కూడా ఈ వీడియోలో చూపించారు. దీంతో ఈ భారీ ఇతిహాసాన్ని తెరకెక్కించడం వెనుక ఉన్న మేకింగ్‌పై అభిమానులకు ప్రత్యేకమైన గ్లింప్స్ లభించింది.
ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ‘రామాయణం’ కోసం ఈస్ట్‌లోని అత్యుత్తమ ప్రతిభను, వెస్ట్‌లోని అత్యుత్తమ టెక్నికల్ టాలెంట్‌ను ఒకే ఆలోచనతో కలిపిన విధానాన్ని కూడా ఈ వీడియోలో చూపించారు.
ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ టెర్రీ నోటరీ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ సినిమాలో రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణు డిగా రవి దూబే నటిస్తున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డీఎన్‌ఈజీ, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి నిర్మి స్తోంది. ‘రామాయణం’ ను రెండు భాగాలుగా తెరకెక్కి స్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్‌లో ‘రామాయణ’ పార్ట్ 1 దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.
దీపావళికి విశ్వవ్యాప్తంగా విడుదల
6 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)