Magazines

ఆ ట్విస్ట్‌లను ఊహించలేరు

5 గంటల క్రితం

twists
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈనెల 2న విడుదల చేయబోతున్నారు. లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. సంధ్య పోషించిన పాత్ర కొత్తగా ఉంటుంది. తారక్ పొన్నప్ప అయితే అందరినీ భయపెట్టేస్తాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సర్ ప్రైజింగ్‌గా ఉంటాయి. మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా కుదిరింది. ఇలాంటి మంచి సినిమాతో మా అబ్బాయి మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ‘మేం ఓపెన్ చేసిన బుకింగ్స్ అన్ని చోట్లా ఫుల్ అవుతున్నాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్‌ని ఎవ్వరూ ఊహించరు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ‘మేం వయసుకు వచ్చాం’ తర్వాత నేను మళ్లీ అలాంటి ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత నాకు మళ్లీ ఓ అద్భుతమైన ప్రేమ కథ తట్టింది. అదే ఈ సినిమా. ఇందులోని ఫ్యామిలీ డ్రామా గొప్పగా ఉంటుంది. ఈ సినిమాతో విక్రమ్‌కి మంచి పేరు వస్తుంది. మా నిర్మాత నాయుడు కూడా ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించారు. ఈ సినిమాని అనకాపల్లిలో ప్రదర్శించాం. అక్కడ మాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది’ అని త్రినాథరావు నక్కిన చెప్పారు. నిర్మాత కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ,‘ఈ చిత్రంలో విక్రమ్ చాలా కొత్తగా కనిపిస్తారు. అందరూ మా సినిమాచూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్