నవతెలంగాణ-హైదరాబాద్: బాక్సింగ్ లో పతకాల పరంపర కొనసాగుతోంది. అంకుష్ పంఘల్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఆసియా క్రీడల్లో శుక్రవారం జరిగిన పురుషుల 80 కేజీల ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్-సియోంగ్‌ను ఓడించి, అంకుష్ పంఘల్ మూడో స్వర్ణాన్ని అందించాడు. ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించి అంకుష్ మొదటి రౌండ్‌ను 4-1 తేడాతో గెలుచుకున్నాడు.ప్రస్తుత కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయిన అతను తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి, 2018లో అమిత్ పంఘల్ తర్వాత ఆసియా క్రీడల బాక్సింగ్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారత పురుష బాక్సర్‌గా నిలిచాడు. మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్ హుడా, 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో ఒకే రోజు బాక్సింగ్ లో భారత్ కు మూడు స్వర్ణ పతకాలు వచ్చాయి.
బాక్సింగ్ లో ఇండియాకు మరో స్వర్ణం
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)