నవతెలంగాణ - హైదరాబాద్: వికారాబాద్ జిల్లా అనంతగిరి వద్ద శనివారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అనంతగిరి నుంచి తాండూరు వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 15 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






కామెంట్‌లు (0)