నవతెలంగాణ - హైదరాబాద్ : క్యూర్ పరిధిలో మరో ఇందిరమ్మ టవర్స్‌కు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో 480 ఫ్లాట్లతో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారు. నాంపల్లిలో రూ.43.20 కోట్ల నిధులతో ఎల్‌ఐజీ ప్లాట్ల టవర్‌ను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రైమ్ ఏరియాలో టవర్లు నిర్మించి పేదలకు ఇస్తున్నామన్నారు. క్యూర్ పరిధిలో మొత్తం నాలుగు విడతల్లో ఇళ్లు మంజూరుచేస్తామని టెండర్లు పిలిచి త్వరలోనే ఇందిరమ్మ టవర్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు.






కామెంట్‌లు (0)