నవతెలంగాణ-హైదరాబాద్ :ఆసియా క్రీడల్లో భారత్ తన మొదటి అథ్లెటిక్స్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన మహిళల 4x400 మీటర్ల రిలే ఫైనల్‌లో కిరణ్, మచెట్టిర పూవమ్మ, ప్రాచి , విత్య రామ్‌రాజ్‌లతో కూడిన భారత జట్టు 3:29.69 సమయంతో అగ్రస్థానంలో నిలిచింది. బహ్రెయిన్ జట్టు 3:30.21 సమయంతో రజత పతకాన్ని గెలుచుకోగా, చైనా 3:31.02 సమయంతో కాంస్య పతకాన్ని సాధించింది.
మహిళల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో ఇప్పటికే కాంస్య పతకం గెలిచిన విత్య రామ్‌రాజ్, ఈ రిలే ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించడంతో మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా మహిళల ట్రాప్ షూటింగ్ పోటీలో నీరూ ధండా భారతదేశానికి మొట్టమొదటి వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించారు.ఇప్పటివరకు ఆసియన్ గేమ్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 52కి పెరిగింది. వీటిలో ఆరు స్వర్ణ పతకాలు కాగా.. 21 రజతం, 25 కాంస్య పతకాలు ఉన్నారు.






కామెంట్‌లు (0)