Magazines

ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల జోరు

9 గంటల క్రితం

Wrestler
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల జోరు సాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల రెజ్లింగ్ ఫైనల్‌లో సుజీత్ కల్కల్ పసిడి సాధించాడు. తజికిస్తాన్‌కు చెందిన అబ్దుల్‌మజీద్ కుడియేవ్‌ను ఓడించి, గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. హోరాహోరిగా సాగిన పోరులో 2-9 స్కోరుతో వెనుకబడి ఉన్న సుజీత్, వరుసగా టేక్‌డౌన్‌లు చేస్తూ మ్యాచ్‌ను తన వైపుకు తిప్పుకుని, పదకొండు సెకన్లు మిగిలి ఉండగానే స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. బాక్సింగ్‌లో, పర్వీన్ హూడా (మహిళల 65 కేజీల విభాగం), అంకుష్ పంఘల్ (పురుషుల 80 కేజీల విభాగం) భారత్‌కు స్వర్ణ పతకాలను అందించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్