నవతెలంగాణ-హైదరాబాద్ : గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా మెండాద్రా తాలూకా డేడ్‌కడియా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న ప్రిష(6)పై పొదల్లో నుంచి వచ్చిన చిరుతపులి దాడి చేసింది. అనంతరం చిన్నారిని ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. గ్రామస్తులు గాలింపు చేపట్టగా సమీపంలోని వ్యవసాయ భూమిలో ప్రిష మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చిరుత కోసం గాలింపు చేపట్టారు. దానిని పట్టుకునేందుకు ఎనిమిది బోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.





కామెంట్‌లు (0)