Magazines

కేటీఆర్ పద్దతిగా మాట్లాడు

03 సెప్టెంబర్, 2026

Jagga Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

కాంగ్రెస్, రాహుల్ గాంధీలు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం ఏర్పడినందునే కేటీఆర్ మంత్రి కాగలిగారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. అలాంటి రాహుల్ గాంధీపై కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. బుధవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వేచ్ఛను కోరి ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపిస్తే వారి ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల పథకాలు అమల్లోకి వచ్చాయని తెలిపారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన చందంగా కాంగ్రెస్‌ను విమర్శించటమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించేందుకు సిద్ధమా? అని బీఆర్ఎస్‌కు సవాల్ విసిరారు. బాధ్యతాయుతంగా వ్యవహరించలేని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ముగ్గురు అసెంబ్లీకి రాకపోతేనే మంచిదని ఎద్దేవా చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్