Magazines

రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు అసలైన సినిమా చూపిస్తాం: ఎంపీ చామల

5 గంటల క్రితం

ktr
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: రేపు సిరిసిల్లలో జరగబోయే సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభలో కేటీఆర్‌కు అసలైన సినిమా చూపిస్తామని ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ హెచ్చరించారు. ఆ రోజును ఆయన జీవితంలో మర్చిపోలేరని హెచ్చరించారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనకు రాకముందే తనపై ఉన్న ఆరోపణలను బయటపెట్టాలని కేటీఆర్ సవాల్ చేయడంపై చామల తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రిని సవాల్ చేసే స్థాయి కేటీఆర్‌కు లేదని, ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు. సిరిసిల్ల ప్రజల ముందే కేటీఆర్ భూ బాగోతాలను రేవంత్ బయటపెడతారని, ఆయన అసలు స్వరూపం దేశమంతటికీ తెలుస్తుందని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్