కుష్నర్‌కు గల్ఫ్ దేశాలతో ఆర్థిక వ్యవహారాలపై కథనం
సౌదీ, యూఏఈ నుంచి భారీగా నిధుల బదిలీ జరిగినట్టు వెల్లడి
ఆరోపణలను ఖండించిన జారెడ్ కుష్నర్.. ఆధారాల్లేవంటూ ప్రశ్న
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అల్లుడు, ఆయన తొలి ప్రభుత్వంలో కీలక సలహాదారుగా పనిచేసిన జారెడ్ కుష్నర్‌పై భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇజ్రాయిల్ నేతలతో ఆయన రహస్యంగా ఆర్థిక వ్యవహారాలు నడిపినట్టు ‘వానిటీ ఫెయిర్’ కథనం వెల్లడించింది. మాథ్యూ కోల్ రాయనున్న పుస్తకంలోని వివరాల ఆధారంగా ఈ ఆరోపణలు ప్రచురిత మయ్యాయి. అయితే వీటిని కుష్నర్ తీవ్రంగా ఖండించారు. ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. నెదర్లాండ్స్ గూఢచారులు ట్రంప్ తొలి ప్రభుత్వ హయాంలో కుష్నర్ ఐఫోన్ కార్యకలాపాలను రహస్యంగా గమనిం చారని కథనం పేర్కొంది. అజర్‌బై జాన్‌లోని ఓ బ్యాంకు నుంచి వందల మిలియన్ డాలర్లు బదిలీ అయిన యూఏఈకి సంబంధిత ఖాతాను ఆయన ఉపయోగిం చినట్టు ఆరోపించింది. అబుదాబీ ఫస్ట్ బ్యాంక్‌లోని వాటాని అల్ ఎమరాత్ ఫౌండేషన్ ఖాతాలోకి సుమారు 75 కోట్ల డాలర్లు వచ్చినట్టు వివరించింది. ఆ ఖాతాకు కుష్నర్ సంతకదారుగా ఉన్నారనీ, అయితే దాని యజమాని కాదని పేర్కొంది. యూఏఈ, సౌదీ పాలకులు ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధానంపై ప్రభావం చూపేందుకు రహస్య నిధిని ఏర్పాటు చేయాలని భావించినట్టు కథనం ఆరోపించింది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చకపోయినా, కుష్నర్ కోసం రెండు ఖాతాల్లో కనీసం 200 కోట్ల డాలర్లు జమ చేసినట్టు పేర్కొంది. మరో ఖాతా ద్వారా ఆయన వ్యక్తిగత ప్రయోజనం కోసం 100 కోట్ల డాలర్లు బదిలీ చేయాలని ప్రయత్నించినట్టు కూడా ఆరోపించింది. ఈ వ్యవహారంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాత్ర ఉందని కథనం వివరిం చింది. అయితే, ఈ ఆరోపణలు నిరాధా రమైనవని కుష్నర్ పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు, లావాదేవీల రికార్డులు, తేదీలు వంటి ఆధారాలను చూపలేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ విచార ణలు, ప్రత్యేక న్యాయవాది దర్యాప్తునకు తాను సహకరించాననీ, అప్పట్లోనూ ఇలాంటి ఆరోపణలు రాలేదని తెలిపారు. ఆయన న్యాయవాది చాడ్ మిజెల్లె కూడా ఆరోపణలను ఖండించారు. అవ సరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకునే అన్ని అవకాశాలూ పరిశీలిస్తామని చెప్పారు.






కామెంట్‌లు (0)