Magazines

రష్యా, ఉక్రెయిన్‌,అమెరికా మధ్య శాంతి చర్చలు

57 నిమిషాల క్రితం

between Russia, Ukraine, and the United States
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవంబర్‌లో అబుదాబిలో త్రైపాక్షిక భేటీ

మాస్కో : యుద్ధానికి ముగింపు పలికే దిశగా రష్యా, ఉక్రెయిన్‌, అమెరికా మధ్య త్రైపాక్షిక చర్చలు అబుదాబిలో వచ్చే నెలలో జరిగే అవకాశముందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ శుక్రవారం తెలిపారు. నవంబర్‌ మొదటి వారంలో చర్చలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి నిలిచిపోయిన చర్చలను తిరిగి ప్రారంభించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. గత వారం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం దౌత్య ప్రయత్నాలను వేగవంతం చేసింది. విట్‌కాఫ్‌ మంగళవారం ఓస్లోలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోది మిర్‌ జెలెన్‌స్కీ, యూరప్‌ నాయకులతో సమావే శమయ్యారు. అనంతరం బుధవారం పుతిన్‌తో చర్చలు జరిపారు. ఈ భేటీల తర్వాత ప్రత్యక్ష చర్చలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమని ఇరు దేశాలు ప్రకటిం చాయి. అయితే, 2022 ఫిబ్రవరి నుండి ఉక్రెయిన్‌, రష్యాల మధ్య భీకర పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే, త్రైపాక్షిక చర్చల్లో తుది శాంతి ఒప్పందానికి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని పుతిన్‌ స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్