Magazines

ఇరాన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటా

3 గంటల క్రితం

avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

అది చాలా కఠినంగా ఉండొచ్చు: ట్రంప్
వాషింగ్టన్ : ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై తాను ఓ నిర్ణయం తీసుకోనున్నానని తెలిపారు. ఆ నిర్ణయాన్ని సులభమైన మార్గంలో అయినా, కఠినమైన మార్గంలో అయినా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగోలేదని పేర్కొన్నారు. అయితే అమెరికా తదుపరి ఏ చర్య తీసుకోబోతోందన్న విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ
వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్‌కు సంబంధించిన అమెరికా తదుపరి చర్యలు, వాటి అమలుకు సంబంధించిన కాలపరిమితిపై కూడా ట్రంప్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. పరిస్థితి తమకు అనుకూలంగా పురోగమిస్తోందని, ఇరాన్ పరిస్థితి మాత్రం అంత బాగోలేదని చెబుతూ తన ప్రణాళికలను గోప్యంగా ఉంచారు. శుక్రవారం కూడా విలేకరులతో మాట్లాడిన ట్రంప్, తన ప్రణాళికలను ముందుగానే వెల్లడిస్తే అవి వార్తలుగా మారతాయని వ్యాఖ్యానించారు. త్వరలోనే యుద్ధం 
ముగుస్తుందన్న ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణ త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ ఇంతకు ముందు చెప్పారు. ఘర్షణలు ముగిసిన తర్వాత చమురు ధరలు భారీగా పడిపోతాయని చెప్పారు. ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా తీవ్రంగా బలహీనపడిందని పేర్కొన్నారు. టెక్సాస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఈ సంఘర్షణ ఎలా ముగియాలనే విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఇరాన్ వ్యవహారం చాలా త్వరలోనే ఏదో ఒక విధంగా ముగుస్తుందని వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్