ప్రమాదంలో 32 మంది మృతి
ఒండో రాష్ట్రంలో ప్రమాదం
ఇగ్బోకోడా: ఒండో రాష్ట్రంలోని ఇగ్బోకోడా సమీపంలో నైజీరియా వైమానిక దళానికి చెందిన '‘ఏటీఆర్-42’ మిలిటరీ విమానం సోమవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది సహా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. బెనిన్ నుంచి ఆర్థిక రాజధాని లాగోస్‌కు సాధారణ రవాణా విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న విమానం ఉదయం 9 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. అనంతరం నావికాదళ స్థావరానికి సమీపంలోని నది ఒడ్డున కూలిపోయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... వైమానిక విమానం నది తీరంలోని చెట్లను తాకుతూ కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో శరీర భాగాలు, దుస్తులు చెల్లాచెదురుగా కనిపించడంతో అక్కడ తీవ్ర భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాలింపు, సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. విమానం కూలిన సమయంలో అందులో మొత్తం 32 మంది ఉన్నారు. వీరిలో 25 మంది ప్రయాణికులు కాగా ఏడుగురు వైమానిక దళ సిబ్బంది ఉన్నారు. బెనిన్ నుంచి లాగోస్‌కు సాధారణ కార్యనిర్వహణలో భాగంగా వెళ్తుం డగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు : టినుబు విమాన ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు తక్షణమే సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని అధ్యక్షుడు టినుబు నైజీరియా వైమానిక దళాన్ని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.‘‘ఇది మన సాయుధ దళాలకు, యావత్ దేశానికి ఒక బాధాకరమైన క్షణం. మన వైమానిక దళ సిబ్బంది నైజీరియాను సురక్షితం గా ఉంచడానికి ప్రతిరోజు తమ ప్రాణా లను పణంగా పెడుతున్నారు. వారి త్యాగాన్ని ఎన్నటికీ మరచిపోలేం. భవిష్యత్తులో ఇలాంటివి జరగ కుండా నివారించడానికి, ఈ ప్రమాదానికి గల కారణాలపై తక్షణ సమగ్ర దర్యాప్తు ప్రారంభిం చ ాలని నైజీరియా వైమానిక దళాన్ని ఆదే శించాం’’ అని తెలిపారు.
సహాయక చర్యలకు ప్రశంసలు
విమాన ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు, సహాయక చర్యలు చేపట్టిన వైమానిక దళాన్ని టినుబు అభినందించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలకు స్పందించిన తొలి స్పందనదారులను, ఒండో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశంసించారు.
ప్రమా దంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
అలాగే నైజీరియా వైమానిక దళానికి ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
మూడు రోజుల జాతీయ సంతాపం
ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైమానిక దళ సిబ్బందికి గౌరవార్థం మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను సగం వరకు అవనతం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు టినుబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదం నైజీరియా సాయుధ దళాలకు, యావత్ దేశానికి బాధాకరమైన క్షణమని అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు వైమానిక దళ సిబ్బంది ప్రతిరోజు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారనీ, వారి త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోలేమని అన్నారు.







కామెంట్‌లు (0)