Magazines

నవనీతమ్‌ నవీ పిళ్లైకి నోబెల్‌ బహుమతి

52 నిమిషాల క్రితం

navanethem-navi-pillay.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 3 నిమిషాల చదవడం

- తమిళనాడు మూలాలున్న దక్షిణాఫ్రికా మహిళకు దక్కిన శాంతి పురస్కారం

- మానవహక్కుల కోసం విశేష కృషి

స్టాక్‌హౌమ్‌: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం భారత్ మూలాలున్న దక్షిణాఫ్రికా వాసి నవనీతమ్‌ నవీ పిళ్లైను వరించింది. నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్‌ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయం, శాంతిని పెంపొందించేందుకు నవనీతమ్‌ నవీ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. మానవ హక్కుల కోసం ఆమె విశేష కృషి చేశారని నోబెల్‌ కమిటీ కొనియాడింది. కాగా, నోబెల్‌ శాంతి బహుమతిని ఆశించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. నోబెల్‌ శాంతి పురస్కారం కోసం 
నోబెల్‌ కమిటీకి 287 నామినేషన్లు ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం కోసం నోబెల్‌ కమిటీకి 287 నామినేషన్లు వెళ్లాయి. సూడాన్‌లోని ఎమర్జెన్సీ బఅందాలు, ఉక్రెయిన్‌లోని పిల్లల హక్కుల కార్యకర్తలు, రెండు అంతర్జాతీయ న్యాయస్థానాలతో పాటు కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ఈ అవార్డు రేసులో నిలిచారు. శాంతి స్థాపన, సోదరభావాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాల కోసం విశేష కఅష్టి చేసిన నవనీతమ్‌ పిళ్లై వైపే నోబెల్‌ కమిటీ మొగ్గుచూపింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక సంఘర్షణలు దౌత్యం, ఒప్పందాలు, చట్టపరమైన మార్గాల్లోనే పరిష్కారం అవుతున్నాయని నార్వే నోబెల్‌ కమిటీ పేర్కొంది. మరింత శాంతియుత ప్రపంచానికి అంతర్జాతీయ చట్టం ఓ పునాది అని, ప్రస్తుతం అనేక సంఘ ర్షణలు, సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఇది అత్యంత అవసరమని అభిప్రాయపడింది. అసాధారణ ధైర్యం, నిజాయితీతో సమగ్రమైన ప్రపంచ న్యాయ వ్యవస్థకు మార్గం ''అసాధారణ ధైర్యం, నిజాయితీతో సమగ్రమైన ప్రపంచ న్యాయ వ్యవస్థకు మార్గం చూపిన వ్యక్తికి 2026 నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ఈ ఏడాది గ్రహీత యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక నేరాలు, జాతి నిర్మూలనపై విచారణ జరిగేలా చూడటంలో కీలక పాత్ర పోషించారు. శాంతి, అంతర్జాతీయ చట్టాన్ని ప్రోత్సహించడానికి ఆమె చేసిన కృషికి గానునవి పిళ్ళైకి 2026 నోబెల్‌ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో వర్ణవివక్ష పాలనలో భారతీయ తమిళ మూలాలున్న కుటుంబంలో జన్మించిన పిళ్ళై, లోతైన వ్యవస్థాగత వివక్ష, వేర్పాటు, బహిష్కరణను ఎదుర్కొంటూ న్యాయవాదిగా, న్యాయరంగ మార్గదర్శకురాలిగా ఎదిగారు.'' అని నోబెల్‌ కమిటీ పేర్కొంది. దక్షిణాఫ్రికాలోని నాటల్‌ ప్రావిన్స్‌లో లా ప్రాక్టీస్‌ చేసిన తొలి మహిళగా చరిత్ర 1941 సెప్టెంబర్‌ 23న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో నవనీతమ్‌ నవీ పిళ్లై జన్మించారు. తమిళ మూలాలున్న నారాయణ్‌స్వామి, శాంతమ్మ ఆమె తల్లిదండ్రులు. వర్ణవివక్షను ఎదుర్కొంటూ పెరిగిన ఆమె, ఆ తర్వాత న్యాయవాదిగా మారి వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. 1967లో దక్షిణాఫ్రికాలోని నాటల్‌ ప్రావిన్స్‌లో లా ప్రాక్టీస్‌ చేసిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అనంతరం 1995లో దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి నల్లజాతీయ మహిళగా నవీ పిళ్లై రికార్డులకెక్కారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షను వ్యతిరేకించిన నెల్సన్‌ మండేలాతో పాటు ఇతరుల తరఫున వాదించారు. 1999 నుంచి 2003 వరకు రువాండా అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్‌ అధ్యక్షురాలిగా సేవలందించిన ఆమె, ఆ తర్వాత అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008 నుంచి 2014 వరకు ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌గా విశేష సేవలందించారు. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ట్రంప్‌ ఆశ నిరాశే.. నోబెల్‌ శాంతి బహుమతిని ఏటా నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ ప్రదానం చేస్తోంది. ఈ పురస్కారం కోసం గతేడాది ట్రంప్‌ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ చివరకు వెనెజువెలా హక్కుల కార్యకర్త మరియా కొరీనా మచాడోను ఈ పురస్కారం వరించింది. వెనిజులా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను మరియా కొరీనాకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నార్వే నోబెల్‌ కమిటీ పేర్కొంది. అయితే, ఈ పురస్కారాన్ని వెనెజువెలా ప్రజలతోపాటు తమ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తోన్న డోనాల్డ్‌ ట్రంప్‌నకు అంకితం ఇస్తున్నానని చెప్పారు. ఈ సారి కూడా నోబెల్‌ బహుమతి కోసం ట్రంప్‌ ప్రయత్నాలు చేశారు. అనేక యుద్ధాలు ఆపానని, తానే అర్హుడినంటూ ట్రంప్‌ మరోసారి పాత పాటే పాడారు. కానీ చివరికీ ఈసారి కూడా ఆయన కాకుండా భారత మూలాలున్న వ్యక్తికి దక్కింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్