నవతెలంగాణ - హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన వివాహిత మహిళ దారం సుప్రియ(31) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మిస్సోరిలో ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందగా.. భారత్‌కు చెందిన మరో యువతి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.






కామెంట్‌లు (0)