Magazines

అమెరికన్లను వేధించారు

2 గంటల క్రితం

They harassed Americans.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

మదురో దంపతులపై తాజా ఆరోపణలు
న్యూయార్క్‌ : వెనిజులా మాజీ అధ్యక్షుడు నికొలస్‌ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌పై తాజా ఆరోపణలు మోపేందుకు న్యూయార్క్‌లోని ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు సిద్ధపడుతున్నారు. వెనిజులా ప్రభుత్వం అమెరికన్లను అక్రమంగా నిర్బంధించి వేధించిందని ప్రాసిక్యూటర్ల తాజా ఆరోపణ. ఈ ఆరోపణలకు సంబంధించి మదురో దంపతులు గురువారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ప్రాసిక్యూటర్ల వాదన ప్రకారం...మదురో అధికారంలో ఉన్న సమయంలో వెనిజులాలో 12 మందికి పైగా అమెరికన్లను జైలులో నిర్బంధించి వేధించారు. ఈ క్రిమినల్‌ కేసుతో సంబంధమున్న మరికొందరిపై కూడా అభియోగాలు మోసే విషయంపై అధికారులు చర్చిస్తున్నారు. జనవరిలో కారకాస్‌లో జరిపిన సైనిక చర్య సందర్భంగా అమెరికా సేనలు మదురో దంపతులను నిర్బంధించి న్యూయార్క్‌లోని బ్రూక్‌లిన్‌లో ఉన్న మెట్రోపాలిటన్‌ డిటెన్షన్‌ కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే. ఆరోగ్య పరిస్థితుల రీత్యా తనను విడుదల చేయాలని మాన్‌హట్టన్‌లోని ఫెడరల్‌ కోర్టును ఫ్లోర్స్‌ కోరారు. అయితే ఇందుకు ప్రాసిక్యూటర్లు అభ్యంతరం తెలిపారు. మదురో దంపతులపై ప్రధాన క్రిమినల్‌ విచారణ వచ్చే సంవత్సరం జూన్‌ 1న ప్రారంభం అవుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్