Magazines

సుప్రీంకోర్టు క్షమాగుణం వల్లే నేరాలు పెరుగుతున్నాయ్

2 గంటల క్రితం

Supreme Court's
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

గతంలో హత్య కేసుల్లో శిక్షలు 'అరుదైన వాటిలో అత్యంత అరుదైన' సిద్ధాంతం పాటించేవారు : జస్టిస్ దీపాంకర్ దత్తా
న్యూఢిల్లీ : మరణశిక్షలను జీవిత ఖైదుగా మార్చే విషయంలో సుప్రీంకోర్టు క్షమా గుణం వల్లే దేశంలో నేరాలు పెరుగుతున్నాయని, దీనికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలని దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జి జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. గతంలో హత్య కేసుల్లో శిక్షలు 'అరుదైన వాటిలో అత్యంత అరుదైన' సిద్ధాంతం ఆధారంగా ఉండేవని అన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో హత్యలు చాలా అరుదుగా జరిగేవని, కానీ ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మర్డర్ కేసులో మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చుకున్న ఒక ఖైదీని ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్