Magazines

దక్షిణాఫ్రికాలో దారుణం...27 మంది మృతి

27 సెప్టెంబర్, 2026

South Africa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దక్షిణాఫ్రికాలో దారుణం చోటుచేసుకుంది. జొహన్నెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌ నగరాల సమీపంలోని టౌన్‌షిప్‌లలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 27 మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. జొహన్నెస్‌బర్గ్‌లోని వెడెలా టౌన్‌షిప్‌లోని ఓ బార్‌లో శనివారం రాత్రి దుండగులు కాల్పులు జరిపారు. ఏకే 47 రైఫిళ్లు, పిస్టళ్లతో వచ్చిన ఎనిమిది మంది ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. మరో 15 మంది గాయపడ్డారు. 

కేప్‌టౌన్‌ సమీపంలోని ల్వాండ్లేలోనూ ఆదివారం తెల్లవారుజామున ఓ దుకాణంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనలకు కొద్ది రోజుల ముందే డర్బన్‌ సమీపంలో ఇంట్లో జరిగిన పార్టీలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ముగ్గురు దుండగులు జరిపిన దాడిలో గర్భిణితో సహా 11 మంది మృతిచెందారు. ఆయా ఘటనల్లో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయకపోవడం గమనార్హం. వరుస ఘటనలతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్