Magazines

పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సెటిలర్ల దాడి

1 గంట క్రితం

Attack by Israeli
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 2 నిమిషాల చదవడం

పరామర్శకు వెళ్లిన 
యూరోపియన్‌ దౌత్యవేత్తలపై కూడా..

అబూ ఫలా(వెస్ట్‌బ్యాంక్‌) : ఇజ్రాయిల్‌ సెటిలర్లు శుక్రవారం ఆలివ్‌ పంటను కోస్తున్న పాలస్తీనియన్లపై దాడికి తెగబడ్డారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనాకు చెంది తైబే గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత బాధితులను పరామర్శించేందుకు శనివారం అక్కడికి వెళ్లిన యూరోపియన్‌ దౌత్తవేత్తలపై కూడా సెటిలర్లు దాడికి పాల్పడ్డారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని గ్రామాల్లో ఆలివ్‌ పంటను తీస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సెటిలర్లు దాడులు చేయడం పరిపాటిగా మారింది. తాజా దాడిలో సెటిలర్లు కార్లు, చెట్లకు నిప్పు పెట్టారు. వీరి దాడిలో ఓ విదేశీ జర్నలిస్టు కూడా గాయపడ్డారు. ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని కనీసం ఎనిమిది గ్రామాలలో ఈ తరహా దాడులు జరిగాయని స్థానిక అధికారులు, పాలస్తీనా రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ తెలిపాయి. ఈ ప్రాంతంలో ఆలివ్‌ తోటలు ఎక్కువగా ఉన్నాయి.

పదివేలకు పైగా పాలస్తీనా కఁటుంబాలు వీటి పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ నెల 27న ఇజ్రాయిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా దానికి ముందు దాడుల తీవ్రత పెరగడం గమనార్హం. మహిళా జర్నలిస్టుపై జులుం సెటిలర్ల దాడులను అడ్డుకోవడాఁకి అధికారులు ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. పైగా ఇజ్రాయిల్‌ సైన్యం వారికి సాయం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం పాలస్తీఁస్తీనియన్లు శాంతి కార్యకర్తలతో కలిసి పంటకోత కోసం బయలుదేరగా సెటిలర్లు వారిపై దాడి చేశారు. వారిలో కొందరు వాషింగ్టన్‌ పోస్ట్‌ ఫొటోగ్రాఫర్‌ను కొట్టారు. దీంతో ఆమె ఆస్పత్రి పాలయ్యారు. ముసుగులు వేసుకొని ఆయుధాలు ధరించిన దుండగులు సుమారు పది నిమిషాల పాటు తనను కొట్టారని ఆమె తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఆలివ్‌ పంట కోతకాలం ప్రారంభమైనప్పటి నుంచి సెటిలర్ల దాడిలో కనీసం నలుగురు పాలస్తీనియన్లు మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య సంస్థ తెలిపింది.


దౌత్యవేత్తలనూ వదలలేదు

తాజా ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన యూరోపియన్‌ దౌత్యవేత్తలపై కూడా ఇజ్రాయిల్‌ సెటిలర్లు జులుం ప్రదర్శించారు. ఈ దౌత్యవేత్తల బృందంలో ఫ్రెంచ్‌ మేయర్‌ కూడా ఉన్నారు. దాడికి గురైన వారిలో బెల్జియం కాన్సుల్‌ జనరల్‌, ఫ్రాన్స్‌, పోలండ్‌ దౌత్యవేత్తలు, కాథలిక్‌ ప్రతినిధులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్