రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో పరామర్శ
రోమ్ : ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేయించుకఁన్న పోప్ లియో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎవరి సాయం లేకుండానే ఆయన ఆస్పత్రి నుంచి నడిచి బయటకు వచ్చారు. అక్కడ గుమిగూడిన వారిఁ పలకరించారు. ఉక్రెయిన్‌కు చెందిన 13 సంవత్సరాల బాలిక ఆయనకు ఓ బొమ్మను అందజేసింది. 71 సంవత్సరాల తొలి అమెరికన్ పోప్ మంగళవారం జెమెల్లీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసి ఊపిరితిత్తుల నుంచి ఓ కణితిని తొలగించారు. అనంతరం ఆయనకు రక్త పరీక్షలు, ఎక్స్-రే పరీక్షలు నిర్వహించారు. కాగా శస్త్రచికిత్స జరిగిన నాలుగు రోజులకే పోప్ లియో తిరిగి విధులలో చేరడం విశేషం. ఆయన వచ్చే నెల 6వ తేదీ నుంచి లాటిన్ అమెరికాలో పర్యటించి ఉరుగ్వే, అర్జెంటీనా దేశాలతో పాటు తాను గతంలో మిషనరీగా, బిషప్‌గా పనిచేసిన పెరూను కూడా సందర్శించాల్సి ఉంది. అయితే పోప్ ఆరోగ్యం ఎలా ఉంటుందో చూడాలని, దాన్ని బట్టి లాటిన్ అమెరికా పర్యటన ఉంటుందా లేక రద్దవుతుందా అనేది నిర్ణయించుకుంటారని వాటికన్ రాష్ట్ర కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్ చెప్పారు. శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి పోప్ ఆస్పత్రి నుంచే విధులు నిర్వహించారు. కార్డినల్స్‌ను కలుసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్లో మాట్లాడారు.





కామెంట్లు (0)