Magazines

వెస్ట్‌బ్యాంక్‌లో కూల్చివేతలు

1 గంట క్రితం

West Bank
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 2 నిమిషాల చదవడం

హెబ్రాన్ నగరాన్ని దిగ్బంధించిన ఇజ్రాయిల్ దళాలు

ఉగ్రవాదుల ఏరివేత పేరిట పాలస్తీనియన్లను తరిమేస్తున్న సైన్యం

ఐరాస, మానవ హక్కుల సంఘాల ఆందోళన


హెబ్రాన్ : వెస్ట్‌బ్యాంక్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెబ్రాన్ నగర సమీపంలో జరిగిన భారీ కాల్పుల ఘటన అనంతరం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆ ప్రాంతంలో సైనిక దిగ్బంధ నాన్ని ప్రకటించారు. హెబ్రాన్ ప్రాంతంలోని ఓ సైనిక చెక్‌పోస్ట్ సమీపంలో గురువారం ఇద్దరు పాలస్తీనా సాయుధులు జరిపిన కాల్పుల్లో ఇరువురు ఇజ్రాయిల్ సైనికులు మరణించగా పలువురు గాయపడ్డారు.ఇజ్రాయిల్ సైన్యం జరిపిన ఎదురు దాడిలో ఆ ఇద్దరు పాలస్తీనా సాయుధులు కూడా చనిపోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ సైన్యం ఆ నగరాన్ని పూర్తిగా దిగ్బంధించింది. భద్రతకు ముప్పు కలుగుతోందన్న అనుమానంతో అనేక భవనాలను కూల్చివేస్తోంది. హెబ్రాన్ నగరంలోకి ఎవరూ ప్రవేశించకుండా రహ దారులను, గేట్లను మూసివేశారు. నగరం లోనూ, దాని పరిసర ప్రాంతాలలోనూ నివసిస్తున్న అనేక పాలస్తీనా కుటుంబాలను సైన్యం బలవంతంగా ఖాళీ చేయిస్తోంది.

నాటి ప్రణాళికనే అమలు చేస్తూ...

గతేడాది ప్రారంభంలో కూడా ఇజ్రాయిల్ సేనలు జెనిన్, తుల్కర్మ్, నూర్ షామ్స్, అల్-ఫరాలోని శరణార్థి శిబిరాల్లో ఇదే విధమైన దిగ్బంధనాన్ని అమలు చేసింది. వేలాది మంది పాలస్తీనియన్లను ఖాళీ చేయించింది. ఇప్పుడు కూడా అదే ప్రణాళికను అమలు చేస్తామని, దాడి జరిగిన ప్రాంతాలను బలవంతంగా ఖాళీ చేయించి వాటిని పూర్తిగా మార్చేస్తామని నెతన్యాహూ చెప్పారు. ఇదిలావుండగా హెబ్రాన్ ప్రాంతంలో ఇజ్రాయిల్ అధికారులు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించారని సైన్యం, ఇజ్రాయిల్ భద్రతా సంస్థ (ఐఎస్‌ఏ) ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను, ఆయుధాలను గుర్తించి వాటిని నిర్మూలించేందుకు ఆ ప్రాంతమంతటా సైనిక దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయని, అనుమానితులను ప్రశ్నిస్తున్నాయని వివరించాయి. ఆ ప్రాంతంలో భద్రతా పరమైన ముప్పు కలిగించే అవకాశమున్న భవనాలను కూల్చివేస్తున్నట్టు కూడా తెలిపాయి.


ఎన్నికల వేళ చర్యలు
ఈ నెల 27న ఇజ్రాయిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో జరిగిన దాడి రాజకీయంగా కలకలం రేపింది. గడచిన కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా వెస్ట్‌బ్యాంక్‌లో పెద్ద ఎత్తున సైనిక చర్య చేపడతామని నెతన్యాహూ హెచ్చరించారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేస్తామని ప్రకటించారు. నాబ్లస్, జెనిన్ సహా ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని కనీసం పదిహేను పట్టణాలపై ఇజ్రాయిల్ దళాలు ఆకస్మిక దాడులు చేసి అనేక మందిని అదుపులోకి తీసుకుంటున్నాయి. తొలుత వెస్ట్‌బ్యాంక్‌ను పూర్తిగా దిగ్బంధించాలని ఆదేశించిన నెతన్యాహూ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. హెబ్రాన్, హల్హూల్ నగరాల పరిసరాలనే దిగ్బంధిస్తామని, అయితే దీనిని ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు.


ఇది సమూహ శిక్షే : ఐరాస
వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్ ప్రభుత్వం విధించిన తీవ్రమైన ఆంక్షలు, సైనిక చర్యలపై ఐరాస, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయిల్ చర్యలు ‘సమూహ శిక్ష’ కిందికి వస్తాయని ఐరాస మానవ హక్కుల కార్యా లయం ప్రతినిధి స్పష్టం చేశారు. ఒకరిద్దరు చేసిన హింసకు మొత్తం పాలస్తీనా సమా జాన్నే నిర్బంధంలోకి నెట్టడం సరికాదని తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేత పేరిట పాల స్తీనియన్లను హెబ్రాన్ ప్రాంతం నుంచి బల వంతంగా ఖాళీ చేయించే ప్రణాళికను ఇరవై ఇజ్రాయిల్ మానవ హక్కుల సంఘా లు తీవ్రంగా నిరసించాయి. పాలస్తీని యన్లను ఖాళీ చేయించేందుకు సైనిక దళాలు తగిన సమయాన్ని కూడా ఇవ్వడం లేదని ఆరోపిం చాయి. ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజ నాల కోసం సైనిక చర్య చేపట్టడం, జనావాసాలను కూల్చివేయడం జరు గుతోందని, దీనిని అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చాయి. సరిహద్దుల మూసివేత, ఇళ్ల కూల్చివేత, తనిఖీల కారణంగా మానవతా సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉన్నదని హెచ్చరించాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్