Magazines

రష్యాపై 'చమురు' ఆంక్షలు రద్దు

2 గంటల క్రితం

Russia lifted
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 3 నిమిషాల చదవడం

వ్యతిరేకత నేపథ్యంలో ట్రంప్‌ నిర్ణయం

భారత్‌, చైనాలకు ఊరట మండిపడిన ఉక్రెయిన్‌


వాషింగ్టన్‌ : రష్యా చమురుపై విధించిన ఆంక్షల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వెనక్కి తగ్గారు. ఆంక్షలు, పరిమితులు, సుంకాలు అమలులోకి రావడాఁకి రెండు రోజుల ముందు ఆయన వాటిని తొలగించారు. ఈ నిర్ణయం కారణంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ట్రంప్‌ మధ్య దూరం మరింత పెరిగింది. రష్యాపై ఆంక్షలకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలుపగా గత నెలలో ట్రంప్‌ ఆ తీర్మానంపై సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. అయితే ట్రంప్‌ అనూహ్యంగా శుక్రవారం రాత్రి ఓ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. అమెరికా ప్రయోజనాల రీత్యా గ్రహం చట్టం కింద విధించిన ఆంక్షలను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నానన్న విషయాన్ని కాంగ్రెస్‌కు తెలియ జేశానని చెప్పారు. ట్రంప్‌ నిర్ణయంపై అమెరికా శాసనకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఏం జరిగిందంటే...

ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యా మీద ఒత్తిడి కోసం రూపొందించిన గ్రహం చట్టంపై ట్రంప్‌ గత నెల 18న సంతకం చేశారు. రష్యా ఇంధన రంగాన్ని, ఆ దేశం నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్న దేశాలను లక్ష్యంగా చేసుకొని ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను అధిక పరిమాణంలో కొనుగోలు చేస్తున్న చైనా, భారత్‌ సహా ఐదు దేశాల నుంచి జరిగే దిగుమతులపై వంద శాతం వరకూ టారిఫ్‌ను విధించే అధికారాన్ని ఈ చట్టం ట్రంప్‌నకు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలోనే పుతిన్‌ సహా రష్యాకు చెందిన ఉన్నత స్థాయి నేతల పైన, రష్యా ఆర్థిక సంస్థల పైన కూడా ట్రంప్‌ ఆంక్షలు విధించారు. అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న 'షాడో ఫ్లీట్‌' నౌకాదళంపై కూడా ఆంక్షలు విధించడం జరిగింది. రష్యా నుంచి అధిక పరిమాణంలో చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌ ఈ నిర్ణయంపై మండిపడుతూ దీనివల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. అయితే వీటిలోని చాలా ఆంక్షలను ఇప్పుడు ట్రంప్‌ రద్దు చేశారు. దీనిపై అమెరికాలోని రష్యా రాయబారి కిరిల్‌ డిమెత్రివ్‌ వ్యాఖ్యానిస్తూ 'ఇది ఒక ముఖ్యమైన, చారిత్రక క్షణం' అని అన్నారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ ప్రారంభించిన యుద్ధం కారణంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. మధ్యంతర ఎన్ని కలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం ట్రంప్‌ను కలవరపెడుతోంది. తాజాగా విధించిన ఆంక్షల కారణంగా చమురు ధరలు మరింత పెరుగు తాయని, అమెరికా వినియోగదారులపై ఒత్తిడి అధికమవుతుందని ఆందోళన వ్యక్తమైంది. అందుకే ఆయన ఆంక్షల నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు.

ఉక్రెయిన్‌ ఆగ్రహం

రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద ఒప్పందంపై ట్రంప్‌ సంతకం చేసిన తర్వాత అమెరికా, ఉక్రెయిన్‌ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రంప్‌ తాజా చర్య ఉక్రెయిన్‌ ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. రష్యా యుద్ధోన్మాదాన్ని అడ్డుకోవాలంటే దానిని ఆర్థికంగా దెబ్బతీయాలని, అందుకోసం కఠినమైన ఆంక్షలు విధించాలని జెలెన్‌స్కీ చాలా కాలంగా కోరుతున్నారు.


భారత్‌ నుంచి భారీగా పెట్టుబడులు వైట్ హౌస్

ప్రపంచదేశాల నుంచి అమెరికాకు వచ్చిన పెట్టుబడుల లెక్కలను తాజాగా వైట్‌హౌస్ వెల్లడించింది. తమ దేశంలోకి ట్రిలియన్ల కొద్దీ పెట్టుబడులు ప్రవహించాయని, భారత్ నుంచే 330 బిలియన్ డాలర్లు మేర వచ్చాయని వెల్లడించింది. యూఎస్‌లో ప్రయివేటు పరిశ్రమలు, విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల మొత్తం 10.87 ట్రిలియన్ డాలర్లని తెలిపింది. వైట్‌హౌస్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ గణాంకాలను పదే పదే ప్రసారం చేసింది. ‘‘అమెరికాలోకి ట్రిలియన్ల కొద్దీ డబ్బు వచ్చి చేరుతున్న శబ్దాన్ని హాయిగా కూర్చొని ఆస్వాదించండి’’ అని దేశ ప్రజలను ఉద్దేశించి ఎక్స్‌ పోస్టులో రాసుకొచ్చింది . కాగా.. అమెరికా లో టెక్సాస్‌ రాష్ట్రంలోని బ్రౌన్స్‌విల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేస్తోన్న కొత్త రిఫైనరీ ప్రాజెక్టులో భారతీయ సంస్థ రిలయన్స్ భాగస్వామిగా ఉంది. ఈ ప్రాజెక్టు నిమిత్తం రిలయన్స్‌ 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది.

ఈ ఏడాది మార్చిలో దీనిపై ప్రకటన వచ్చింది. మరోవైపు, భారత్‌కు చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ ఎస్సార్ గ్రూప్‌ .. యూఎస్‌లో తన అనుబంధ సంస్థ మొసాబి మెటాలిక్స్‌ ద్వారా 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. అయోవా రాష్ట్రంలో ఉక్కు కర్మాగార నిర్మాణానికి ఎస్సార్ గ్రూప్ ఈ భారీ మొత్తాన్ని సమకూర్చనుంది.మే నెలలో జరిగిన సెలక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు సందర్భంగా.. అమెరికాలో 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రణాళికలను భారత పారిశ్రామిక వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. వచ్చేనెలలో జరగనున్న మధ్యంతర ఎన్నికల కోసం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఆ సభల్లో పెట్టుబడుల గురించి చెబుతున్నారు. తన ప్రభుత్వ హయాంలో 20 ట్రిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు, పెట్టుబడి హామీలను సాధించామని చెప్పారు.


రష్యాకు లొంగిపోయారు

ట్రంప్‌ నిర్ణయాన్ని వర్జీనియా కాంగ్రెస్‌ సభ్యుడు డాన్‌ బేయర్‌తో పాటు పలువురు డెమొక్రాట్లు వ్యతిరేకించారు. రష్యాకు ట్రంప్‌ లొంగిపోయారని, ఉక్రెయిన్‌కు, జెలెన్‌స్కీకి వెన్ను పోటు పొడిచారని ఆరోపించారు. 'రష్యాకు ట్రంప్‌ తాజాగా లొంగిపోవడం మన ఉక్రెయిన్‌ భాగ స్వాములకు మరోసారి ద్రోహం చేయడమే కాకుం డా రష్యా దురాక్రమణకు శిక్ష విధించేందుకు కాం గ్రెస్‌ రూపొందించిన చట్టాన్ని ఉల్లంఘిస్తోంది' అని బేయర్‌ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో మండిపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్