న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు
ముంబయి : సీనియర్ పేసర్, దేశవాళీ సహా ఐపీఎల్‌లో అదరగొడుతున్న భువనేశ్వర్ కుమార్ నాలుగేండ్ల తర్వాత మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. భువనేశ్వర్ కుమార్‌తో పాటు గాయంతో ఆసియా క్రీడలకు దూరమైన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సైతం జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ నెల 16న భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరనుండగా.. 22న తొలి టీ20తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. వరుణ్ రాకతో రవి బిష్ణోయ్ చోటు కోల్పోగా.. హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్ సమస్యలతో సెలక్షన్‌కు అందుబాటులో లేడు.
భారత టీ20 జట్టు :
శ్రేయస్, అభిషేక్, శాంసన్, వైభవ్, కిషన్, తిలక్, అక్షర్, దూబె, నితీశ్, నమన్, ప్రిన్స్, మయాంక్, అర్ష్‌దీప్, భువనేశ్వర్, వరుణ్, కుల్‌దీప్.
భువనేశ్వర్‌కు పిలుపు
2 గంటల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)