Magazines

గెలుపు ముంగిట హైదరాబాద్‌

4 గంటల క్రితం

Hyderabad on the verge of victory
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

త్రిపుర రెండో ఇన్నింగ్స్‌ 99/7

హైదరాబాద్‌ ‌తొలి ఇన్నింగ్స్‌‌ 294/10

నవతెలంగాణ-హైదరాబాద్‌ :

రంజీ ట్రోఫీ తొలి రౌండ్‌ ‌మ్యాచ్‌‌లో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ‌విజయం ముంగిట నిలిచింది. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌‌పై త్రిపుర బ్యాటర్లను హైదరాబాద్‌ ‌బౌలర్లు వణికించారు. తొలి ఇన్నింగ్స్‌‌లో 134 పరుగులకే కుప్పకూలిన త్రిపుర.. రెండో ఇన్నింగ్స్‌‌లో 99/7తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. స్పిన్నర్‌ ‌తనయ్‌ ‌త్యాగరాజన్‌ (3/42), కెప్టెన్‌ ‌మహ్మద్‌‌ సిరాజ్‌ (2/19) సహా రుతిక్‌ ‌యాదవ్‌ (1/14), అభిరాథ్‌ ‌రెడ్డి (1/1) రాణించారు. 33 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయిన త్రిపుర మరో 61 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. అంతకముందు, హైదరాబాద్‌ ‌తొలి ఇన్నింగ్స్‌‌లో 294 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌‌లో 160 పరుగుల ఆధిక్యం సాధించింది. తన్మయ్‌ అగర్వాల్‌ (54), రుతిక్‌ ‌యాదవ్‌ (61, 150 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు. సివి మిలింద్‌ (40, 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌‌లు), రాహుల్‌ (40, 119 బంతుల్లో 1 ఫోర్‌), అనికెత్‌ ‌రెడ్డి (20) రాణించారు. త్రిపుర స్పిన్నర్‌ ‌సందీప్‌ ‌సర్కార్‌ (8/96) ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. నేడు ఉదయం సెషన్లో 3 వికెట్లు పడగొట్టి ఇన్నింగ్స్‌ ‌విజయంతో రంజీ ట్రోఫీలో బోణీ కొట్టాలని హైదరాబాద్‌ ఎదురుచూస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్