Magazines

కెప్టెన్‌గా మంధాన

2 గంటల క్రితం

Mandhana as captain
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

జింబాబ్వేతో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
ముంబయి : భారత మహిళల జట్టు ఆల్‌ ఫార్మాట్‌ కెప్టెన్‌గా స్టార్‌ బ్యాటర్‌ స్మృతీ మంధాన ఎంపికైంది. 2013 నుంచి జాతీయ జట్టులో కొనసాగుతున్న మంధాన.. వైస్‌ కెప్టెన్‌గా నాయకత్వ బృందంలో కొనసాగింది. ఆసియా క్రీడల విజయానంతరం హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా తప్పుకోగా స్మృతీని కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 16 నుంచి స్వదేశంలో జింబాబ్వేతో జరుగనున్న వైట్‌బాల్‌ సిరీస్‌ నుంచి భారత్‌కు మంధాన నాయకత్వం వహించనుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్లేయర్‌గా కొనసాగుతుండగా, దీప్తి శర్మ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్