హైదరాబాద్ : భారత్, వెస్టిండీస్ నాల్గో టీ20 మ్యాచ్ బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరుగనుండగా, ఈ సిరీస్‌కు టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది. బీసీసీఐతో ఒప్పందం ప్రకారం భారత్‌లో జరిగే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముత్తూట్ ఫిన్‌కార్ప్ సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ‘భారత ప్రజలకు చేరువయ్యేందుకు క్రికెట్ ఒక అర్థవంతమైన మార్గాన్ని అందిస్తుందని’ ఆ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ థామస్ జార్జ్ ముత్తూట్ తెలిపారు. జాతీయ జట్ల హోమ్ సీజన్‌కు ముత్తూట్ ఫిన్‌కార్ప్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించటం భారత క్రికెట్ బలం, విస్తృతి, ప్రజలతో అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ అన్నారు.
టీ20 సిరీస్ టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్
4 గంటల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)