నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ గ్రామీణ ప్రాంత క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి, సరైన శిక్షణ అందించి రంజీ ట్రోఫీ సహా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే స్థాయికి తీర్చిదిద్దటమే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లక్ష్యమని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ కాకతీయ వర్శిటీ గ్రౌండ్‌లో రాష్ట్ర స్థాయి అండర్-19 లీగ్ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ర్ట ఉపాధ్యక్షుడు విజయచందర్‌రెడ్డితో కలిసి గురువారెడ్డి ప్రారంభించారు. ‘తెలంగాణ 32 జిల్లాల క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. గ్రామీణ క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు అవసరమైతే బీసీసీఐ కార్యాలయం ఎదుట వేల మందితో ధర్నాకు దిగుతామని’ గురువారెడ్డి హెచ్చరించారు.
టీసీఏతో గ్రామీణ క్రికెటర్లకు భరోసా
4 గంటల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)