Magazines

ఆంధ్ర, కర్నాటక మ్యాచ్‌ డ్రా

49 నిమిషాల క్రితం

Andhra, Karnataka match drawn
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం

హైదరాబాద్‌ : రంజీ ట్రోఫీ తొలి రౌండ్‌ మ్యాచ్‌ను ఆంధ్ర డ్రాగా ముగించింది. అగ్ర జట్టు కర్నాటకతో విజయవాడలో జరిగిన మ్యాచ్‌లో మూడు రోజుల పాటు ఆధిపత్యం చెలాయించిన ఆంధ్ర.. ఆఖరుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో సరిపెట్టుకుంది. కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 82.2 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 121.5 ఓవర్లలో 418 పరుగుల భారీ స్కోరు చేసింది. సీరమ్‌ రాహుల్‌ (119), రేవంత్‌ రెడ్డి (97) రాణించారు. కరుణ్‌ నాయర్‌ (155 నాటౌట్‌, 242 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో ప్రతిఘటించగా రెండో ఇన్నింగ్స్‌లో కర్నాటక పుంజుకుంది. 103 ఓవర్లలో 337/9 పరుగుల వద్ద డిక్లరేషన్‌ ప్రకటించింది. ఆఖరు రోజు 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటంలో ఆంధ్ర విఫలమైంది. 44 ఓవర్లలో 4 వికెట్లకు 104 పరుగులే చేసింది. ఎటాకింగ్‌ బ్యాటింగ్ చేయకుండా ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌తోనే సరిపెట్టుకుంది. కర్నాటక తరఫున బరిలోకి దిగిన కెఎల్‌ రాహుల్‌, దేవదత్‌ పడిక్కల్‌, మయాంక్‌ అగర్వాల్‌ నిరాశపరిచారు. ఆంధ్ర ఆటగాడ సీరమ్‌ రాహుల్ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యచ్‌'గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ఆంధ్ర 3 పాయింట్లు దక్కించుకోగా, డ్రాతో కర్నాటక ఓ పాయింట్‌ ఖాతాలో వేసుకుంది. రంజీ ట్రోఫీ రెండో రౌండ్‌లో ఆదివారం నుంచి ఆంధ్ర, హైదరాబాద్‌లు విజయనగరం వేదికగా తలపడనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్