Magazines

ముగిసిన ముంబయి, మహేళ బంధం

3 గంటల క్రితం

Mumbai-Mahela
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

చీఫ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన జయవర్ధనే

ముంబయి: ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్, శ్రీలంక దిగ్గజ క్రికెటర్ మహేళ జయవర్దనే దశాబ్ద కాల బంధానికి ముగింపు పలికారు. 2017-2022 వరకు ముంబయి ఇండియన్స్ చీఫ్ కోచ్ గా వ్యవహరించిన జయవర్ధనే… 2025-2026 సీజన్లకు సైతం ప్రధాన కోచ్ హోదాలో ఉన్నారు. 2022-25 వరకు ముంబయి ఇండియన్స్ గ్లోబల్ క్రికెట్ హెడ్ గా ఆ ఫ్రాంచైజీ జట్లను పర్యవేక్షించారు. ముంబయి ఇండియన్స్ తరఫున చీఫ్ కోచ్ గా 2019, 2020 ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. కానీ గత రెండు సీజన్లలో ముంబయి ఇండియన్స్ నిరాశ పరిచింది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ముంబయి ఇండియన్స్ సమీక్షలో జట్టు నాయకత్వంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. దీంతో జయవర్ధనే చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఐపీఎల్ 2027 సీజన్ ఆటగాళ్ల వేలం డిసెంబర్ లో ఉండగా, నవంబర్ 15 లోపు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సమయంలో జయవర్ధనే తప్పుకోవటం ముంబయి ఇండియన్స్ కి ఇబ్బందికరం కానుంది. ఫ్రాంచైజీ యాజమాన్యం జట్టు కోచింగ్ సిబ్బందిగా యువకులను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుంచి ప్లేయర్ ట్రేడింగ్ లో వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్య సైతం సారథిగా, ఆటగాడిగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ప్లేయర్ ట్రేడింగ్ తో హార్దిక్ పాండ్య ఫ్రాంచైజీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్