Magazines

ఇండోర్‌‌లోనూ పరుగుల పోటీ!

52 నిమిషాల క్రితం

Running competition in Indore too!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 2 నిమిషాల చదవడం

గెలుపే లక్ష్యంగా 
బరిలోకి శ్రేయస్‌‌సేన

భారత్‌, వెస్టిండీస్‌ ‌మూడో 
టీ20 నేడు

రాత్రి 7 నుంచి స్టార్‌‌స్పోర్ట్స్‌‌లో..

​నవతెలంగాణ-ఇండోర్‌ : రాంచి టీ20లో 38.3 ఓవర్లలోనే 501 పరుగులు నమోదు కాగా.. నేడు ఇండోర్‌‌లోనూ పరుగుల వరదకు రంగం సిద్ధమైంది. సంప్రదాయంగా ఇండోర్‌ భారీ స్కోర్ల పిచ్‌. టీ20ల్లో పుజారా, ఆమ్లా, రౌసో, రోహిత్‌, శ్రేయస్‌ ‌సెంచరీలు చేయగా.. వన్డేలో సెహ్వాగ్‌ ‌ద్వి శతకం ఇక్కడే కొట్టాడు. గత రెండేండ్లలో ఇక్కడ భారత్‌ ‌టీ20 ఆడలేదు కానీ, చివరి మూడు వన్డేల్లో 399, 385, 337 పరుగుల స్కోర్లు నమోదయ్యాయి. దీంతో నేడు భారత్‌, వెస్టిండీస్‌ ‌మూడో టీ20లోనూ భారీ స్కోర్లు అంచనా వేస్తున్నారు. ఇరు జట్ల బ్యాటర్లు ఉత్సాహంతో ఉండగా.. బౌలర్లు తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నారు.

​మిడిల్‌ ఓవర్లలో ఎలా?

రాంచి టీ20లో మిడిల్‌ ఓవర్లలో వికెట్‌ తీయకపోవటం భారత్‌‌కు ప్రతికూలంగా మారింది. కుల్‌‌దీప్‌ ‌యాదవ్‌ ‌మినహా మరో బౌలర్‌ ‌మిడిల్‌ ఓవర్లలో వికెట్‌ ‌పడగొట్టలేదు. పవర్‌‌ప్లేలో మయాంక్‌ ‌యాదవ్‌ ‌మూడు వికెట్లతో మెరిసినా.. ఆ తర్వాత వికెట్ల వేటకు బ్రేక్‌ పడింది. అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌, అక్షర్‌ ‌పటేల్‌, నమన్‌ ‌దిర్‌‌లు సైతం వికెట్‌ ‌తీసే ప్రయత్నంలో విఫలం అయ్యారు. భారీ స్కోర్ల ఛేదనలో క్రమంగా వికెట్లు పడగొట్టడం ఎంతో కీలకం. నెమ్మదిగా భాగస్వామ్యాలు నిర్మిస్తూ ముందుకెళ్లిన హోప్‌.. భారత్‌‌ వరుస విజయాల రికార్డుకు బ్రేక్‌ ‌వేశాడు. అక్షర్‌ ‌పటేల్‌, కుల్‌‌దీప్‌, మయాంక్‌ ‌యాదవ్‌, అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌ ‌సమిష్టిగా మెరిస్తేనే ఇండోర్‌‌లో భారత్‌ ‌పైచేయి సాధించగలదు. బౌలర్లు మిడిల్‌ ఓవర్ల ప్రణాళికలకు పదును పెట్టాల్సిన సమయం ఇది. బ్యాట్‌‌తో భారత్‌‌కు తిరుగులేదు. అభిషేక్‌ ‌శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ ‌కిషన్‌ ‌సహా శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ ‌వర్మలు భీకర ఫామ్‌‌లో ఉన్నారు. పేస్‌ ఆల్‌‌రౌండర్‌ ‌బెర్త్‌ ‌కోసం నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, శివం దూబె పోటీపడుతున్నారు. మరి కోచ్‌,కెప్టెన్‌ ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారో చూడాలి.

​కరీబియన్ల ‘హోప్‌’

అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో కరీబియన్లకు గెలుపు నమ్మకంతో పాటు విజయాన్ని రుచి చూపించాడు కెప్టెన్‌ ‌షయ్‌ ‌హోప్‌. భారత్‌‌పై నిలకడగా భారీ స్కోర్లు చేస్తున్న హోప్‌ ‌నేడు ఇండోర్‌‌లోనూ విండీస్‌‌కు అతిపెద్ద బలం. టాప్‌ ఆర్డర్‌‌లో ఇతర బ్యాటర్లు నిలకడగా విఫలమవుతున్నా.. హోప్‌ ఓ ఎండ్‌‌లో నిలబడుతూ, విండీస్‌‌ను నిలబెడుతున్నాడు. భారత బౌలర్లు హోప్‌‌ను సాగనంపేందుకు కొత్త ప్రణాళికలతో వస్తే కానీ పరిస్థితిలో మార్పు ఉండబోదు!. షిమ్రోన్‌ ‌హెట్‌‌మయర్‌, షెర్ఫేన్‌ ‌రూథర్‌‌ఫోర్డ్‌, రొమారియో షెఫర్డ్‌, రోవ్‌‌మాన్‌ ‌పావెల్‌ ‌కరీబియన్లకు కీలకం. ​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్