చత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్ 279/7
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బౌలర్లు మరోసారి ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచారు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో చత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తొలి రోజు 7 వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ జి అనికెత్ రెడ్డి (2/59), పేసర్ రక్షణ్ రెడ్డి (2/34) రెండేసి వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ సీవీ మిలింద్, స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్, రుతిక్ యాదవ్‌లు తలా ఓ వికెట్ తీసుకున్నారు. దీంతో హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్ తొలి రోజు ఆటలో చత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగులు చేసింది. కెప్టెన్ అనూజ్ తివారీ (72, 133 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), వికల్ప్ తివారీ (69, 96 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలు సాధించారు. జయంత్ యాదవ్ (36 నాటౌట్, 108 బంతుల్లో 4 ఫోర్లు), ప్రతీక్ యాదవ్ (27, 64 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఆఖర్లో హైదరాబాద్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. సంజీత్ దేశాయ్ (0), ఆమన్‌దీప్ ఖారె (0) డకౌట్‌గా నిష్క్రమించారు. తొలి రోజు ముగిసేసరికి జయంత్ యాదవ్, అజయ్ మండల్ (9 నాటౌట్) అజేయంగా క్రీజులో నిలిచారు.





కామెంట్‌లు (0)