ఈ నెల 30 నుంచి సీజన్ 5
హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఐదో సీజన్‌కు అహ్మదాబాద్ వేదికగా నిలువనుంది. అంతర్జాతీయ వాలీబాల్ ఫెడరేషన్ (ఎఫ్‌ఐవీబీ) గుర్తింపు లభించిన తర్వాత జరుగనున్న సీజన్ ఈ నెల 30న ఆరంభం కానుంది. 2030 కామన్వెల్త్ క్రీడలతో పాటు 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని ఎదురుచూస్తున్న అహ్మదాబాద్..ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు వేదికగా నిలువటం సంతోషకరమని పీవీఎల్ సీఈవో జో భట్టాచార్య తెలిపారు. పీవీఎల్ సీజన్5లో పది జట్లు పోటీపడుతుండగా, లీగ్ దశ అనంతరం ఈసారి సూపర్5 దశను ప్రవేశపెట్టనున్నారు. అహ్మదాబాద్ డిఫెండర్స్, బెంగళూరు టార్పెడోస్, కాలికట్ హీరోస్, చెన్నై బ్లిట్జ్, ఢిల్లీ తుఫాన్స్, గోవా గార్డియన్స్, కోచి బ్లూ స్ర్టయికర్స్, కోల్‌కతా థండర్‌బోల్ట్స్, ముంబయి మెటీయర్స్, తెలుగు బ్లాక్‌హాక్స్ జట్లు ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో పోటీపడుతున్నాయి.







కామెంట్లు (0)