ఇషా త్రయానికి గోల్డ్ మెడల్
దోహా (ఖతార్) : భారత స్టార్ షూటర్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ మరో పసిడి పతకం సాధించింది. ఖతార్‌లోని దోహా వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో మహిళల జట్టు విభాగంలో ఇషా సింగ్ బంగారు పతకం సొంతం చేసుకుంది. మహిళల 25 మీటర్ల జట్టు విభాగంలో ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్, దివ్య సుబ్బరాజులతో కలిసి ఇషా సింగ్ అగ్రస్థానంలో నిలిచింది. రెండు రోజుల అర్హత రౌండ్‌లో ఇషా సింగ్ 590 పాయింట్లు సాధించగా.. మను భాకర్ 587, దివ్య సుబ్బరాజు 584 పాయింట్లు సాధించారు. భారత త్రయం 1761 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం దక్కించుకున్నారు. దక్షిణ కొరియా షూటర్లు 1748 పాయింట్లతో రెండో స్థానంలో సిల్వర్ మెడల్ నెగ్గగా, వియత్నాం అమ్మాయిలు 1745 పాయింట్లతో మూడో స్థానంలో కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నారు. వ్యక్తిగత విభాగంలో ఫైనల్స్‌కు సైతం అర్హత సాధించిన ఇషా సింగ్.. లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్ కోటా సాధించే రేసులో నిలిచింది.






కామెంట్‌లు (0)