డిప్యూటీ కలెక్టర్ల సమావేశంలో క్రీడాశాఖ మంత్రి
నవతెలంగాణ-హైదరాబాద్ : జాతీయ స్థాయిలో రాష్ర్ట ప్రతిష్టను చాటేలా, దేశం గర్వించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించాలని రాష్ర్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరుగనున్న నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్లతో మంగళవారం క్రీడాశాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. రూ.203 కోట్లతో యూత్ గేమ్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో రూ.120 కోట్లను మౌలిక సదుపాయాల అభివృద్దికి కేటాయించినట్టు స్పెషల్ సీఎస్ వాణి ప్రసాద్ తెలిపారు. యూత్ గేమ్స్‌కు 11 స్టేడియాలు సిద్దమవగా, మరో ఐదు స్టేడియాల్లో పనులు వేగంగా సాగుతున్నాయి శాట్ ఎండీ సోనీబాలా దేవి అన్నారు.
తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ (టీసీపీఎల్) నాల్గో సీజన్ లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన బీఆర్‌ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సహా వ్యవస్థాపకులు రాఘవేంద్ర యాదవ్, లీగ్ ఫౌండర్ వెంకటేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)